KOOSE MUNISAMY VEERAPPAN:’ ఒక హంతకుడు వీరుడు కాలేడు..కానీ వీరుడే.. ‘వణికించే సన్నివేశాలతో ట్రైలర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనేక భాషల్లో విభిన్న కథలతో ఆకట్టుకున్న ఎన్నో సినిమాలను, వెబ్ సిరీస్ లను అందిస్తూ జనాలను ఎంటర్‌టైన్ చేస్తూ వస్తున్న అతి పెద్ద ఓటీటి ప్లాట్ ఫామ్ ZEE5 ప్లాట్ ఫామ్ లోకి మరో ఒరిజినల్ కంటెంట్ చేరింది.. అదే తమిళ్ ఒరిజినల్ సిరీస్ ‘కూసే మునస్వామి వీరప్పన్’. ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అడవుల్లోకి పారిపోయి తలదాచుకున్న బందిపోటు దొంగ కూసే మునస్వామి వీరప్పన్ జీవితానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి ఈ ఒరిజినల్‌ను రూపొందించారు. ఈ క్రమంలో సదరు బందిపోటు దొంగకు సన్నిహితులైన వారి నుంచి వివరాలను సేకరించారు. అదేవిధంగా ఆయన్ని పట్టుకోవటానికి ప్రయత్నించిన అధికారుల నుంచి సేకరించిన వీడియోను కూడా పొందుపరిచారు. ఇది వీరప్పన్ యొక్క రహస్య జీవితాన్ని, అతని నేర వారసత్వాన్ని స్పష్టంగా ఆవిష్కరించింది.. ఈ సిరీస్ ను తమిళ్ తోపాటుగా,తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ZEE5 ఎక్స్‌క్లూజివ్‌గా డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది…
అంత పెద్ద హంతకుడిని పట్టుకోవడానికి మూడు దశాబ్దాల పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక అడవుల్లో పోలీసులు అన్వేషించారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో నాటకీయంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) టీమ్ చేసిన ఎన్‌కౌంటర్‌లో వీరప్పన్ మరణించారు. పోలీసుల రికార్డుల్లో, చరిత్రలో తన చరిత్ర ఓ భాగంగా మాత్రమే మారింది. ఇందులో వీరప్పన్ స్వయంగా నెరేషన్ ఇచ్చారు. ఇదొక తమిళ కథనం. దీంతో కూసే మునస్వామి వీరప్పన్‌పై ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన దృక్పథం ఏర్పడుతుంది.
Also Read
- Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
- Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
ఈ సందర్భంగా ZEE5 ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ కల్రా మాట్లాడుతూ.. మా ప్రేక్షకుల కోసం ‘కూసే మునస్వామి వీరప్పన్’ ఒరిజినల్‌ను అందించటం థ్రిల్లింగ్‌గా ఉంది. ఇండియాలో పేరు పొందిన అడవి దొంగ గురించి చాలా మందికి తెలియని విషయాలను ఈ సిరీస్ అందిస్తుంది. వీరప్పన్ జీవితంలోని ఒడిదొడుకులను, అతనున్న స్థానిక గ్రామాల్లోని ప్రజలపై అతని ప్రభావం ఎలా ఉండేదనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. సాధారణంగా జీవితంలో విజయవంతమైన వ్యక్తుల కథలకు ప్రాధాన్యత దొరుకుతుంది. అయితే అయితే చీకటి మార్గాలను ఎంచుకున్న కూసే మునస్వామి వీరప్పన్ వంటి సంక్లిష్టమైన కథలకు ఈ సిరీస్ ఒక రిమైండర్‌గా ఉపయోగపడుతుంది. ఈ సిరీస్ మన జీవితం గురించి వైవిధ్యంగా ఆలోచింప చేస్తుందని మేం నమ్ముతున్నాం అన్నారు.
ఇక నిర్మాత ప్రభావతి మాట్లాడుతూ* ‘‘మన ప్రాంతీయ కథలను గ్లోబల్ రేంజ్ ప్రామాణాల్లో చెప్పటానికి ధీరన్ ప్రొడక్షన్స్‌ను స్థాపించాం. ఇప్పుడు మన ప్రేక్షకుల అంచనాలను, వారు గ్లోబల్ రేంజ్ కథలను ఆదరించే విధానం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మా బ్యానర్‌లో తొలిసారి కూసే మునస్వామి వీరప్పన్ వంటి ఒరిజనల్‌ను రూపొందించటం థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ను ప్రేక్షకులు చక్కగా ఆదరిస్తారని నమ్మకంగా ఉంది అన్నారు.
సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకునే లక్షలాది మంది ప్రేక్షకుల కోసం విభిన్నమైన భాషల్లో ఎప్పటికప్పుడు కొత్త కథనాలున్న బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ZEE 5 అందరినీ అలరిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఓ గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్‌లాంటి జీ లిమిటెడ్‌లో ZEE 5 ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ ఓ భాగం. 12 భాషల్లో (ఇంగ్లీష్, హిందీ, బెంగాలి, మళయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠి, ఒరియా, భోజ్‌పురి, గుజరాతి, పంజాబి) ..3500 చిత్రాలు, 1750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షల గంటల ఆన్ డిమాండ్ కంటెంట్ ఉన్న అన్‌లిమిటెడ్ కంటెంట్ జీ 5 సొంతం. ఈ కంటెంట్‌లో బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్, నేషనల్ లెవల్ మూవీస్, టీవీ షోస్, సంగీతం, పిల్లలకు సంబంధించిన షోస్, ఎడ్ టెక్, సినీప్లేస్, వార్తలు, లైవ్ టివి, మరియు హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ షోస్ ఉంటాయి. గ్లోబల్ టెక్ డిస్రప్టర్స్‌తో తన భాగస్వామ్యాల నుండి వచ్చిన బలమైన డీప్-టెక్ స్టాక్, ZEE5 బహుళ పరికరాలు, ఎకోసిస్టమ్స్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్స్ వెంబడి 12 నావిగేషనల్ భాషలలో అపరిమిత, హైపర్-వ్యక్తిగతీకరించబడిన కంటెంట్ వీక్షణ అనుభవాన్ని అందించుటకు దోహదపడుతుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్‌ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!