NTV Telugu Site icon

Kondapochamma Sagar : వారి కుటుంబాల్లో విషాదం.. గల్లంతైన ఐదుగురు యువకుల మృతదేహాలు లభ్యం

Dead

Dead

Kondapochamma Sagar : హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు ఈ రోజు ఉదయం కొండపోచమ్మ సాగర్‌కు పర్యటనకు వెళ్లారు. అందులో కొందరు రిజర్వాయర్ వద్దకు వెళ్లి ఈత కొడుతూ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఈ క్రమంలో ఆ యువకులు డ్యామ్‌లోకి పడిపోయారు. అక్కడున్న స్థానికులు వారిని రక్షించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించినప్పటికీ, ఐదుగురు యువకులు నీటిలో గల్లంతయ్యారు.. అయితే… మిగిలిన ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే.. తాజాగా గల్లంతైన ఐదుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన ఐదుగురు యువకుల మృతదేహాలను అధికారులు వెలికితీశారు. 6 గంటల పాటు  గాలింపు చర్యలు కొనసాగాయి.. మృతిచెందిన వారు దినేష్, ధనుష్, జతిన్, లోహిత్, సాహిల్‌గా గుర్తించారు అధికారులు. ఈ ప్రమాదం నుంచి మృగాంక్, ఇబ్రహీం బయటపడ్డారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

MG Windsor EV: దేశంలోని నంబర్-1 ఎలక్ట్రిక్ కారు.. ఇండియన్ గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2025 విజేత..

Show comments