Site icon NTV Telugu

Konda Vishweshwar Reddy: కేసీఆర్ కుటుంబంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Konda Vishweshwar Reddy

Konda Vishweshwar Reddy

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన వందలాది మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో చేవెళ్ల ఎంపి కొండా విశ్వే్శ్వర్ రెడ్డి తన వాంగ్మూళం ఇచ్చేందకు సిట్ ముందు హాజరయ్యారు. గంటన్నరకు పైగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేశారు సిట్ అధికారులు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి తన ఫోన్ ట్యాపింగ్ కు గురైన ఆధారాలను చూపించారు సిట్ అధికారులు. ఈ క్రమంలో కేసీఆర్ కుటుంబంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read:AP High Court: విద్యాశాఖ కమిషనర్‌పై హైకోర్టు సీరియస్‌.. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం..

కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. “కెసిఆర్, కేటీఆర్ లు దిగజారి ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారు.. చట్టం మీద రెస్పెక్ట్ లేదు వ్యక్తుల ప్రైవసీ మీద గౌరవం లేదు.. పదవులు కాపాడుకోవడానికే ఫోన్ ట్యాపింగ్ చేశారు.. 2018 లోనే ఎన్నికలలో ఓడిపోతానని గ్రహించి అప్పుడే ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడి గెలిచారు.. ఇక భవిష్యత్తులో కెసిఆర్ మళ్లీ పదవిలోకి రాడు.. దర్యాప్తు సక్రమంగా జరగకపోతే సిబిఐకి అప్పగించాలి.. జితేందర్ రెడ్డి తో మాట్లాడిన ఫోన్ కాల్ ను సిట్ అధికారులు నాకు వినిపించారు.. ప్రణీతరావు రికార్డు చేశారు ఆ ఫోన్ కాల్ ను.. కొన్ని ఫోన్ కాల్స్ ని డిలీట్ చేశారు.. ఎన్నికల సమయంలో నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారు పోలీసులు.. తన ఇంట్లో కంప్యూటర్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తనిఖీ చేశారు..

Also Read:Bangladesh: ఢాకాలో దుర్గా మాత ఆలయం కూల్చివేత.. భారత్ నుంచి తీవ్ర స్పందన..

ఎలాటి సెర్చ్ వారెంట్ లేకుండా నా ఇంట్లో ఎలా తనిఖీలు చేశారని పోలీసులను ప్రశ్నించాను.. ఆ టైంలో నాపైనే రివర్స్ కేసు పెట్టారు.. తానే పోలీసులపై దాడి చేశానని, నాపైన కేసు పెట్టారు.. బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయమంటే చేయలేదు.. నాపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.. ఎన్నికలు ముగిసిన తర్వాత నన్ను అరెస్టు చేయాలని చూశారు.. అప్పటి డిజిపి నన్ను అరెస్టు చేస్తారని చెప్పాడు.. తెలంగాణ ఉద్యమ కారుడినైన నేనే వీళ్ళ పాలనకు భయపడి బెంగళూరులో రెండు వారాల పాటు తలదాచుకున్నాను.. నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసి నా భార్య కలవడానికి వస్తే ఆ ఫోన్‌ని కూడా ట్యాప్ చేసి ఫాలో చేశారని” అన్నారు.

Exit mobile version