చేవెళ్లలో బిజెపి జెండాను ఎగరవేస్తానన్నారు ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన చేవెళ్ల నియోజకవర్గం లో పర్యటించారు. చేవెళ్ల మండలంలోని పామెన, కందవాడ, పల్గుట్ల, మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే ప్రజలందరి సమస్యను పరిష్కరిస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలకు పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం, సంక్షేమ పథకాలు కాలేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి కెసిఆర్ తెలంగాణ ప్రజలను నిలువు నా మోసం చేశారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ విజయం ఖాయమని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ కి దేశంలో రాజకీయంగా ఎదురులేదని ఆయన మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో చేవెళ్ల బిజెపి కన్వీనర్ కేఎస్ రత్నం, చేవెళ్ల మొయినాబాద్ మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిమానులు, అనుచరులు పాల్గొన్నారు.
MP K.Laxman : కర్పూరీ ఠాకూర్‌కి భారత రత్న ఇచ్చింది మోడీ ప్రభుత్వం
రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు బిజెపి చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో పర్యటించిన ఆయన స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మోడీ పాలనలో ప్రజలంతా మతసామరస్యంతో కలిసిమెలిసి జీవించారని ఆయన కొనియాడారు. రంజాన్ పర్వదినం ముస్లిం సోదరుల జీవితాల్లో సుఖ సంతోషాలను తీసుకురావాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. మరింత సమాచారానికి దయచేసి సంప్రదించండి : 9963980259/ 9959154371
Pakistan: పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం..