Site icon NTV Telugu

Konda Vishweshwar Reddy : గత బడ్జెట్‌లో ఎంత పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు చెప్పాలి

Konda Vishwesar Reddy

Konda Vishwesar Reddy

అసెంబ్లీ సమావేశాల నిర్వాహణపై స్పీకర్ పోచారం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. రేపు (శనివారం) గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేపట్టాలని సభ్యులు నిర్ణయించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై తెలుగులో కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. ప్రభుత్వం అందించిన ప్రసంగాన్ని ఆమె యథాతథంగా చదివారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆమె అన్నారు. దేశ ధాన్యాగారంగా తెలంగాణ ఆవిర్భవిస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత, ప్రజాప్రతినిధుల కృషితో రాష్ట్రం ముందుకెళ్తోందన్నారు. తెలంగాణ అపూర్వ విజయాలను సాధించిందన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో తెలంగాణ విరాజిల్లుతోందని, తాగునీటి సమస్యల కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి తెలంగాణ బయటపడిందని తెలిపారు. అయితే.. బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా గవర్నర్‌ ప్రసంగంలో మాట్లాడారని, ముమ్మటికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనంటూ కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు.

Also Read : Rebels Of Thupakula Gudem Review: రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం రివ్యూ

ఈ నేపథ్యంలో బీజేపీ నేత కొండ వివశ్వేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం రాసి ఇచ్చేదే గవర్నర్ చదివిందని, ప్రభుత్వం గవర్నర్ కి ఇచ్చింది అన్ని అబద్ధాలు, తప్పులు అని ఆయన దుయ్యబట్టారు. దళిత బంధు ఇవ్వలేదని, డబల్ బెడ్ రూం లు ఇవ్వలేదని చెప్పిస్తే బాగుండేదన్నారు కొండ విశ్వేశ్వర్‌ రెడ్డి. నా ప్రభుత్వము ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాము అని, దళితులను మోసం చేశామని ప్రసంగంలో ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. తెలంగాణ బడ్జెట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉంటుందని, గత బడ్జెట్ లో ఎంత పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు చెప్పాలన్నారు. కేసీఆర్‌ బడ్జెట్‌లు పెద్ద స్కాం చేశారని, ఆల్కహాల్, పెట్రోల్, డీజిల్ ల మీదనే ఈ ప్రభుత్వము నడుస్తుంది.. అభివృద్ధి అంటే ఇది కాదని కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూములు కబ్జా గురవుతున్నాయన్న ఆయన.. సామాన్యులను బెదిరించి భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో కూడా కుటుంబ పాలన చూడలేదు… వారసత్వ పాలన చూసాము… కానీ ఇక్కడ చూస్తున్నామన్నారు.

Also Read : Afghanistan: టీవీ షోలో సర్టిఫికేట్లు చించేసిన ప్రొఫెసర్.. దాడి చేసి నిర్భంధించిన తాలిబాన్లు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య విభేదాలు రచ్చ బహాటంగా చర్చకు వచ్చింది. అయితే.. ఈ సారి అసెంబ్లీ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే జరిపేందుకు సిద్ధమవుతున్న వేళ.. హైకోర్టు జోక్యంతో సద్ధుమణిగింది. దీంతో.. ప్రభుత్వం తరుఫున గవర్నర్‌ను అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానించారు. దీంతో.. అసెంబ్లీలో గవర్నర్‌ తమిళిసై ప్రసంగంపై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినదే గవర్నర్‌ చదవడంతో.. కాంగ్రెస్‌ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version