Site icon NTV Telugu

Minister Konda Surekha: మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్.. వడ్డీ లేని రుణాలు అందిస్తామన్న మంత్రి

Konda Surekha

Konda Surekha

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిందని.. రోజుకో శాఖను తాను పరిశీలిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేస్తామన్నారు. “మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం. మొదటి విడుతలలో మహిళ శక్తి క్యాంటీన్ లను ప్రారంభించాం. ఎంజీఎం ఆసుపత్రిలో నూతన ఓపి కేంద్ర ప్రారంభించాం.. ఆసుపత్రిలో నూతనంగా ఫార్మాసీ కేంద్రం ఏర్పాటు చేశాం..
డయాలసిస్ యూనిట్ కేంద్రంను ఏర్పాటు చేస్తాం.. మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తాం..” అని పేర్కొన్నారు.

READ MORE: Soyam Bapu Rao : బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ

ఎంజీఎం ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని.. ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు వెల్లడించారు. త్వరలోనే ఎంజీఎంలో సేవలందించే సిబ్బందిని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ ఆస్పత్రిలో వేరే జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు కూడా వైద్య సేవలు కోరుకుంటున్నారని తెలిపారు.. నిరుపేద ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.

READ MORE: Technology: ప్రతి ఆరు నిమిషాలకు ఒక కొత్త టెక్నాలజీ.. పేటెంట్ రైట్స్ కోసం భారీగా దరఖాస్తులు

Exit mobile version