కొండా సురేఖ ను గెలిపియ్యండి మంత్రిని చేస్తానని వ్యాఖ్యానించారు కొండా మురళి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. యూపీ ముఖ్యమంత్రి అక్కడ బుల్డోజార్లతో కూలగొడుతుంటే నేను ఇక్కడ మీరు యువతతో కులగొట్టిస్తానన్నారు. నేను ఎవరికి భయపడనని, యువత గుర్తుపెట్టుకోండి చిట్టక్క మా ఇద్దరి కంటే ధైర్యవంతురాలు. మా ఇద్దరిని కలిపితే చిట్టక్క అని ఆయన వ్యాఖ్యానించారు. తూర్పులో భూములను కబ్జా చేసి కొంతమంది లీడర్లు భూమి చుట్టూ చీరలు కడుతున్నారని, దాని వల్ల లాభం లేదు. పేదలకు.ఇళ్లు కట్టియ్యాలని ఆయన డిమాండ్ చేశారు. భయపడితే ఏం అవుతుంది ఏం కాదు మహా అంటే కేస్ అవుతుంది.. కేస్ అవుతే కొండమురలి లాంటి లీడర్లు అవుతారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Divya Sridhar: నా మాజీ భర్త ఎంతోమంది అమ్మాయిల్ని మోసం చేశాడు.. ఆ పైలట్ చావుకి కారణమయ్యాడు
తోట పవన్ ధైర్యంగా ఉండు నేను నీకున్న అని ఆయన అన్నారు. ధైర్యంగా ఉండీ ముందుకి వెళ్లు అన్నారు. అధికారం ఉందని ముందు ఒక బండి వెనుకాల ఒక బండి ఉంచుకొని తిరుగితే ఏం రాదని, అధికారం శాశ్వతం కాదన్న కొండా మురళి.. ఒక్క ఆరు నెలలు కష్ట పడండి రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని ఆయన జోస్యం చెప్పారు. ‘మీడియా మిత్రులకు ఒక్కమాట చెబుతున్న నేను ఏ పార్టీ లో ఉంటే అక్కడ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. నా కాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అధికారం వస్తుంది. దయచేసి మీడియా మిత్రులు గుర్తు పెట్టుకొవ్వాలి. మీకు మాట ఇచ్చా మాట తప్పా మడమ తిప్ప. మీకు ఏ లాంటి భవనం కట్టించానో మీకే తెలుసు. యువత మీకు నేను రక్షణగా నేనున్నా. మీపై ఈగ వాలితే వారి అంతు చూస్తా. కొండా మురళి మీకు అండగా ఉంటాడు. మీరందరూ కష్టపడండి కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేయండి’ అని ఆయన అన్నారు.
Also Read : Kanti Velugu : రికార్డు దిశగా కంటివెలుగు.. 1.58 కోట్ల మందికి పైగా పరీక్షలు