వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ నేతలకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల మంత్రి కేటీఆర్‌పై కొండా మురళి చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా కొండా మురలి చల్లా ధర్మారెడ్డికి సవాల్ విసిరారు. తాజాగా కొండా మురళి మాట్లాడుతూ.. ధర్మారెడ్డి.. డేట్ టైమ్ చెప్పు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని, ఎవరిని ఎవరు తరిమి కొడతారో తేల్చుకుందాం అంటూ కొండా మురళి సవాల్ విసిరారు. అంతేకాకుండా.. పార్టీ అవకాశం ఇస్తే పరకాలలో పోటీచేస్తానన్న కొండా మురళి.. ధర్మారెడ్డి నీ అంతు తేలుస్తానని వ్యాఖ్యానించారు. బుల్లెట్లకు ఎదురొడ్డి నిలబడ్డ కొండా మురళీ ఎప్పటికీ భయపడబోడని, నంది పైపులు అమ్ముకునే బతికిన ధర్మారెడ్డి నా గురించి మాట్లాడతావా అంటూ ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Covid Vaccine: రెండు వారాల్లో తేలనున్న కోవిడ్ వ్యాక్సిన్, గుండెపోటుకు మధ్య సంబంధం
మహిళా ఎంపీపీని అవమానించిన చరిత్ర ఎమ్మెల్యే ధర్మారెడ్డిదని, ఎమ్మెల్యే ధర్మారెడ్డి మట్టి దొంగ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా మురళి. ధర్మారెడ్డి అరాచకాలు భరించలేక ఆయన కార్యకర్తలు నా దగ్గరకు వస్తున్నారని, మైసమ్మ సాక్షిగా పరకాలలో ధర్మారెడ్డిని ఓడిస్తానన్నారు. భయ పడటం అనేది మా వంశంలో లేదని, కేటీఆర్ చెప్తే మీడియాతో మాట్లాడినవ్ అని ఆయన ధ్వజమెత్తారు. నేనేమైనా ఛత్తీస్ గఢ్ గోండు బిడ్డనా… నా భాష బాగాలేదట.. నేను సన్నాసుల కాళ్లు మొక్క.. చెంచాగిరి అనేది బీఆర్ఎస్ పార్టీలోనే పుట్టింది. నాకు రాజకీయ బిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి. అహంకారపు మాటలు మానుకోకపోతే నిన్ను తరిమికొడతాం. పరకాలలో ఉంటా, వరంగల్ తూర్పులో ఉంటా…దమ్ముంటే కాచుకోండి. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కొవిడ్ సమయంలో చిన్న చిన్న దుకాణదారుల దగ్గర డబ్బులు వసూలు చేశారు అని కొండా మురళి వ్యాఖ్యానించారు.