Site icon NTV Telugu

Madhavi latha: హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి ఆస్తులెన్నో తెలుసా! ధనిక అభ్యర్థుల్లో ఒకరిగా రికార్డ్!

Madhvi Latha

Madhvi Latha

హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ప్రత్యర్థులకు ధీటుగా ప్రచారంలోనూ.. మాటల్లోనూ తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారు. తొలి విడత అభ్యర్థుల ప్రకటనలోనే మాధవి లత పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగింది. అప్పటి వరకు అంతగా పరిచయం లేని ఆమె.. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటన.. పైగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌పై పోటీకి దిగడంతో ఆమె మరింత పాపులారిటీ సంపాదించింది. ఇప్పటికే ఆమె తన పంచ్‌ డైలాగ్‌లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా అఫిడవిట్‌లో ఆమె చూపించిన ఆస్తుల్లోనూ ఓ రేంజ్ చూపిస్తున్నారు. తెలంగాణలో అత్యంత ధనిక అభ్యర్థుల్లో ఆమె కూడా ఒకరిగా నిలిచి రికార్డ్ సృష్టించారు.

ఇది కూడా చదవండి: Nikhil: టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ.. మామ కోసం హీరో నిఖిల్‌ ప్రచారం

హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బుధవారం మాధవి లత నామినేషన్ దాఖలు చేశారు. ఆమె అఫిడవిట్‌లో రూ.221 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా ఆమె పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో అత్యంత ధనిక లోక్‌సభ అభ్యర్థుల్లో ఆమె కూడా ఒకరిగా నిలిచారు. ఆమె భర్త కొంపెల్ల విశ్వనాథ్, ముగ్గురు పిల్లలకు సంబంధించి రూ.165.46 కోట్లు ఉండగా.. దంపతులకు 55.91 స్థిరాస్తులు ఉన్నట్లుగా ఆమె ప్రకటించింది. మొత్తం రూ.221.37 కోట్లు ఉన్నట్లు ఆమె వెల్లడించారు.

బుధవారం తన నామినేషన్‌ దాఖలు చేస్తూ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో మాధవి లత కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. 49 ఏళ్ల వయసు కలిగిన మాధవి లత భాగ్యనగరంలో నివాసం ఉంటున్నారు. తొలిసారి ఆమె బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అనూహ్యంగా ఆమెకు సీటు దక్కింది. లిస్టెడ్ మరియు అన్‌లిస్టెడ్ కంపెనీల్లో రూ.25.20 కోట్ల పెట్టుబడితో సహా రూ. 31.31 కోట్ల చరాస్తులు తనకు ఉన్నాయని ఆమె ప్రకటించారు. అలాగే విరించి లిమిటెడ్‌లో రూ. 7.80 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు. ఆభరణాలను కూడా కలిగి ఉన్నట్లు వెల్లడించారు. వాటి విలువ రూ. 3.78 కోట్లుగా పేర్కొన్నారు. ఆమె భర్త విరించి లిమిటెడ్‌లో రూ. 52.36 కోట్ల విలువైన షేర్లతో రూ. 88.31 కోట్ల చరాస్తులను కలిగి ఉన్నారని… అలాగే ముగ్గురు పిల్లలు కూడా రూ. 45 కోట్లకు పైగా చరాస్తులను కలిగి ఉన్నారని వెల్లడించారు.

ఇది కూడా చదవండి:Retirement: 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ క్రికెట‌ర్‌..

ఇక ఆమె రూ. 6.32 కోట్ల స్థిరాస్తులను కలిగి ఉండగా.. ఆమె భర్త స్థిరాస్తుల విలువ రూ. 49.59 కోట్లు ఉన్నాయి. హైదరాబాద్ మరియు చుట్టుపక్కల వ్యవసాయేతర భూమి, వాణిజ్య మరియు నివాస భవనాలు ఉన్నట్లు తెలిపారు. రూ.90 లక్షల అప్పు కూడా ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఒక క్రిమినల్ కేసు ఉందని తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 295-A కింద ఆమెపై గత వారం బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సిద్ది అంబర్ బజార్ సర్కిల్ దగ్గర ఉన్న మసీదు వద్ద ఊహాజనిత బాణం గీసి కాల్చినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై క్రిమినల్ కేసు నమోదైంది.

ఇది కూడా చదవండి: Megha Akash: పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్?

Exit mobile version