NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy : 65వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు లైన్‌లుగా విస్తరించాలనేది నా కల

Komatireddy

Komatireddy

Komatireddy Venkat Reddy : నల్లగొండ జిల్లాలో నేడు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 65వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలవుతాయన్నారు. 65 వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు లైన్ లుగా విస్తరించాలనేది నాకల అని ఆయన వ్యాఖ్యానించారు. విస్తరణ తర్వాత యాక్సిడెంట్ ఫ్రీ జాతీయ రహదారి అందుబాటులోకి వస్తుందని, మే నెలలో జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలై రెండు సంవత్సరాలలో పూర్తవుతాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. వాహనాల రద్దీ విషయంలో GMR ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చెప్పిందన్నారు మంత్రి కోమటి రెడ్డి. GMR నేషనల్ హైవే అథారిటీతో చేసుకున్న అగ్రిమెంట్ ను ఉల్లంఘించిందన్నారు. నా పోరాటం వల్లే 65 వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ జరగబోతుందని, జాతీయ రహదారి విస్తరణ తర్వాత నల్లగొండ జిల్లాలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.

Mohan Lal : ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్న మోహన్ లాల్ బిగ్గెస్ట్ డిజాస్టర్

అంతేకాకుండా..’అర్వపల్లి జంక్షన్ లో ఫ్లైఓవర్ లేదు ప్రజలు ఆందోళనకు గురికావద్దు. ట్రిపుల్ ఆర్ పనులు మే నెలలో మొదలవుతాయి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయి.. హైదరాబాద్ రూపు రేఖలు మారిపోతాయి. త్రిబుల్ ఆర్ పూర్తి చేసేందుకు నేను, సీఎం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నాం. కేటీఆర్ ను ధర్నాలు దీక్షలు, పాదయాత్ర చేసినా ప్రజలు నమ్మరు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ. నల్గొండ జిల్లా కేంద్రంలో రైతు ధర్నా చేసే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. బీఆర్ఎస్ చేసిన మోసం వల్లే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 50 వేలకు పైగా మెజారిటీ, ఎంపీలు దేశంలోనే రికార్డు మెజారిటీతో గెలిచారు. 10 సంవత్సరాలు పాలించి.. వందేళ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు. త్వరలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని పార్టీలు తెర మరగయిపోతాయి.’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Trump On TikTok: అలా చేస్తేనే అమెరికాలో టిక్‌టాక్‌ సేవలను తిరిగి ప్రారంభిస్తాం..