NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: కేసీఆర్ కు నాలెడ్జ్ లేదు

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

కేసీఆర్ కి నాలెడ్జ్ ఉంది అనుకున్న.. ఏం మాట్లాడిండో.. ఎందుకు మాట్లాడిండో అర్థం కాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎంత పని లెనోడు అయినా నాలుగు గంటలు లైవ్ లో మాట్లాడతాడా అని విమర్శించాడు. మెంటల్ గానికి ఎవరు ఏందో తెలియదన్నారు. తనకు కాంట్రాక్టు పనులే లేవని..మానేరు పనులు తానే చేసినట్లు చెప్పడంపై మండిపడ్డారు. హరీష్ బినామీ ఈ పనులు తీసుకుని.. మూడు నాలుగు వందల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. కేసీఆర్ కి మెంటల్లి బ్యాలెన్స్ లేదన్నారు. బిడ్డ జైల్లో ఉంటే.. ఏ తండ్రి పరిస్థితి అయినా మెంటల్ బ్యాలెన్స్ తప్పుతదన్నారు. కేసీఆర్ నిమ్స్ లో దొంగ దీక్ష చేశారని విమర్శించారు. ఇప్పుడు విద్యుత్ గురించి మాట్లాడుతున్నారని.. కేసీఆర్ హయాంలో తాను సబ్ స్టేషన్ కి వెళ్లి లాక్ షీట్ చూస్తే 8 నుండి 9 గంటల విద్యుత్ వచ్చినట్టు రికార్డు లో ఉందన్నారు.

READ MORE: DK Aruna: ఎన్నికల్లో ఎవరో చెబితో ప్రజలు ఓట్లు వేయరు.. మా గెలుపు ఖాయం

తాను వెళ్లిన సబ్ స్టేషన్ ఉద్యోగిని కేసీఆర్ సస్పెండ్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ కి 8 నుండి12 సీట్లలో డిపాజిట్ కూడా రాదని జోష్యం చెప్పారు. మెదక్ లో జనం లేక హోటల్ దగ్గర గంట సేపు ఆగిండన్నారు. 10 ఏళ్లు సీఎం చేసిన వ్యక్తి సభ పెడితే 2 వేల మంది కూడా రాలేదని విమర్శించారు. నీ బిడ్డ కడిగిన ముత్యం లాగా వస్తదంటివి.. ముత్యం అయితే ఇంట్లో పెట్టుకో.. బంగారం అయితే ఇంట్లో దాచుకోమని వ్యాఖ్యానించారు. లిక్కర్ కేసులో కవిత మూలంగా తెలంగాణ పరువు పోయిందన్నారు. బిడ్డా, కొడుకుని జాగ్రత్తగా చూసుకోమని తెలిపారు. కాంగ్రెస్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని చూసే వాడు.. మూడో సారి కేసీఆర్ గెలిస్తే.. పోలవరం దగ్గర మల్లో లిఫ్ట్ ఇరిగేషన్ కడతా అనే వాడు.. ఎమ్మెల్సీకి ఇన్ని రోజులైనా బెయిల్ రాదా అంటున్నాడని విమర్శించారు. ఎమ్మెల్సీ అయితే ఏంటి, సీఎం అయితే ఏంటి చట్టం ముందు అంతా ఒక్కటే అన్నారు.