రాష్ట్ర ప్రభుత్వం, కోటీశ్వరుల పిల్లలకు అందించిన నాణ్యమైన విద్యను పేద పిల్లలకు అందించాలనే లక్ష్యంతో యువ భారత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా గంధంవారి గూడెంలో రూ.300 కోట్లతో నిర్మించబోతున్న ఈ పాఠశాల ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైలాన్ ఆవిష్కరించి, భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఇంగ్లీష్, తెలుగు మీడియంలో అందించేందుకు ఈ పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నారననారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు కులమతాలకు అతీతంగా చదువుకునేందుకు వీలుగా పాఠశాలలను నిర్మిస్తున్నారని, ఈ పాఠశాలల్లో చదువుతోపాటు, ప్లే గ్రౌండ్స్, అన్ని వసతులు ఏర్పాటు చేయబడతాయి, క్రీడల ద్వారా విద్యార్థుల మానసిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
Mahadev Betting App: జ్యూస్ అమ్ముకునే స్థాయి నుంచి రూ.6000 కోట్ల నేరసామ్రాజ్యం..
రాష్ట్రంలోని 28 నియోజకవర్గాల్లో మొదటి విడత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించబడనున్నాయి, మొత్తం వ్యయం రూ.5000 కోట్లగా ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి చెందిన 10 నెలల కాలంలో 70,000 మందికి ఉద్యోగాలు అందించామని, త్వరలోనే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నామని మంత్రి చెప్పారు. రైతుల సంక్షేమానికి సంబంధించి, 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ పాఠశాలల నిర్మాణం ద్వారా తెలంగాణలో పేదల విద్యా సాధనలో అంకితభావం పెరగనుంది. ప్రభుత్వ మంత్రి, విద్యార్థులు ఈ పాఠశాలలను ఆశ్రయించి, కుటుంబం, రాష్ట్రం, దేశం అభివృద్ధిలో భాగంగా తమ కృషి కొనసాగించాలని కోరారు.
మూసీ తో కోటి మందికి ఎఫెక్ట్ అవుతుందని, నల్గొండలో బోర్లు వేస్తే పచ్చటి నీళ్లు వస్తాయన్నారు. మూసీని శుద్ధి చేస్తామంటే కేటీఆర్ అడ్డుపడుతున్నారని, ఇందిరమ్మ ఇల్లు త్వరలోనే అందజేస్తామన్నారు. నెలకు 6000 కోట్ల వడ్డీ కడుతూ ఉద్యోగులకు మొదటి తేది నే జీతాలు ఇస్తున్నామన్నారు. 18 వేల కోట్ల రుణమాఫీ చేశామని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన రుణమాఫీ వడ్డీలకి సరిపోయిందని, లక్ష రుణాలు మాఫీ చేయడానికి నాలుగు విడుదల చేశారని, హరీష్ రావు సిగ్గులేకుండా మాట్లాడకు అంటూ మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలో డబ్బులు ఉన్నా లేకున్నా పద్ధతి ప్రకారం పనులు చేసుకుంటూ పోతున్నామన్నారు. పాలమూరు నుంచి ఎంపీగా గెలిచిన కేసీఆర్.. సీఎం అయిన పాలమూరును పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ 10 ఏళ్లు సీఎంగా ఉన్న వర్షాలు పడలేదని,కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వర్షాలు పడుతున్నాయన్నారు.
Doraemon: చిన్నపిల్లల డోరేమాన్ వాయిస్ ఆర్టిస్ట్ ఇకలేరు.. ఒయామా కన్నుమూత