NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy : మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

తెలంగాణలో అకాల వర్షాలతో రైతులు నష్టపోతుంటే బిఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మంత్రులపైన అలాగే నాందేడ్ లో బీఆర్ఎస్ పార్టీని బలపరచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. ఇవాళ ఆయన ప్రజ్ఞాపూర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తప్పకుండా బొంద పెడతారని నమ్మకం కాంగ్రెస్ పార్టీకి ఉందని ఆయన తెలిపారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ప్రజలలోకి వెళ్తుందని ఆయన అన్నారు.

Also Read : Tamarind Leaves: చింత చిగురు తీసుకుంటే.. ఈ సమస్యలన్నీ మటుమాయం

రాహుల్ గాంధీపై బీజేపీది కక్షపురిత చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారం నమ్మకండని, కలసి పని చేస్తామన్నారు. కాంగ్రెస్ ని అధికారం లోకి తెద్దామని, కేసీఆర్ ఇక్కడ ఎదో చేసినట్టు మహారాష్ట్ర గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ప్రమాణం చేయాలని, సింగరేణి ప్రైవేటికరణకు ఒప్పుకున్నవా..లేవా అని ఆయన సవాల్‌ విసిరారు. కాంగ్రెస్ బలగం అంతా వచ్చిందని, భట్టి తో కలిసి పాదయత్ర చేశారన్నారు. భట్టి ని చూస్తే… వైఎస్‌ గుర్తుకు వస్తున్నారని ఆయన కొనియాడారు. మరో వైపు పీసీసీ పాదయాత్ర చేస్తున్నారన్నారు. భట్టి కూడా వైఎస్‌ లెక్కనే.. టెంటు లో ఉంటున్నాడని, పంచ కట్టు తోనే ఉన్నాడన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టావు కేసీఆర్.. కేబినెట్ లో సామాజిక న్యాయం ఉందా.. ఒక్కడే దళిత మంత్రి ఉన్నాడు.. మాదిగ సామాజిక వర్గంకి చోటు లేదు.. చేతిలో ఉన్న మంత్రి పదవే ఇవ్వలేదు .. అందరికి దళిత బందు ఇస్తాడా..? అని ఆయన ప్రశ్నించారు.

Also Read : GST Rule Change: వచ్చే నెలనుంచి మారనన్న జీఎస్టీ రూల్.. వ్యాపారులకు తిప్పలే