ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణలోని రామగుండంలో గల ఎరువుల ఫ్యాక్టరీని, భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోడీకి గవర్నర్ తమిళి సై, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బేగంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. మునుగోడులో బీజేపీ కార్యకర్తలు వీరోచితంగా పోరాటం చేశారని మోడీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో చీకటి తరిమి సూర్యోదయం వస్తుందన్న మోడీ.. భయంతో నన్ను తిట్టేవాళ్లు ఇక్కడ ఉన్నారని వారి గురించి కార్యకర్తలు చింతించవద్దన్నారు మోడీ.
Also Read : Ponnala Lakhsmaiah : మోడీ శంకుస్థాపనకు వచ్చింది లేదు… ప్రారంభించిన పనే లేదు..
ఛాయ్ తాగుతూ ఎంజాయ్ చేయాలంటూ కార్యకర్తలకు సూచించారు మోడీ. 25 ఏళ్లుగా తనకు చాలా రకాల తిట్లు తనకు అలవాటే అని కార్యకర్తలు పెద్దగా పట్టించుకోవద్దని టీఆర్ఎస్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు మోడీ. కమల వికాసం స్పష్టంగా తెలంగాణలో కనిపిస్తుందని అన్నారు ప్రధాని మోడీ. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన పోయి బీజేపీ ప్రభుత్వం రావాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అవినీతి, కుటుంబ పాలన దేశానికి మొదటి శత్రువులని మోడీ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ సభ అనంతరం.. మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మోడీ మట్లాడారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికను బాగా ఫైట్ చేశారని మోడీ నాతో అన్నారన్నారు. మీ గురించి అమిత్ షా నాకు అంతా చెప్పారని మోడీ అన్నారని ఆయన వివరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఓడించి బీజేపీ అధికారంలోకి వస్తుందని, నాతో వ్యక్తిగతంగా మోడీ మాట్లాడారని ఆయన వెల్లడించారు. మునుగోడు సంబంధించి నా దగ్గర మొత్తం రిపోర్ట్ ఉందని మోడీ నాతో అన్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
