NTV Telugu Site icon

Komatireddy Rajgopal Reddy : దేశంలోనే ఇది అతిపెద్ద కుంభకోణం ధరణి

Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajgopal Reddy Fires on TRS

మునుగోదు క్యాంప్ కార్యాలయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 8 సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబం, టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు ఎలా దోచుకున్నారో మనందరికీ తెలుసు అని అన్నారు. ధరణి పేరుతో ప్రైవేట్ భూములను కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంది.. దేశంలోనే ఇది అతిపెద్ద కుంభకోణం. 24లక్షల ఎకరాల భూమిని డిస్ప్లేట్ లో పెట్టారు. 6 లక్షల ఎకరాల భూమిని లంచం తీసుకొని రిలీజ్ చేశారు. 18లక్షల కోట్ల భూమిని ధరణి పోర్టల్ ద్వారా తమ గుప్పిట్లో పెట్టుకున్నారు.. కేసీఆర్ చెప్పు చేతుల్లో ధరణి పోర్టల్ ఉంది.. భూస్కాం పై సీబీఐ తో దర్యాప్తు చేయాలి.

 

ధరణి పోర్టల్ అవకతవకలపై విచారణ జరిపించాలి.. నిన్న బీజేపీ నామినేషన్ కార్యక్రమానికి రాకుండా ప్రజలను అడ్డుకున్నారు. మునుగొడులో బీజేపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారు… నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలకు అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి బయటకు రావాలి.. నాపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలి… టీఆర్‌ఎస్‌ పార్టీ పోస్టర్ లు వేసినది. నవంబర్ 3 తరువాత కేసీఆర్ కు మునుగోడు ప్రజలు పోస్టర్ లు వేస్తారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.