Site icon NTV Telugu

Komatireddy Rajgoapl Reddy : కేసీఅర్ చేసిన అవినీతి ఏ సీఎం చేయలేదు..

Rajgopal Reddy

Rajgopal Reddy

మరోసారి సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కేసీఅర్ చేసిన అవినీతి ఏ సీఎం చేయలేదని ఆయన ఆరోపించారు. బీజేపీ పులి లాంటిదని, మిమ్మల్ని మింగుతదని ఆయన వ్యాఖ్యానించారు. పోటీసులు లేకుండా కేసీఅర్ బయట తిరుగుతారా అని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చ లేదని, పని చేస్తే పదవులు వస్తాయి.. బీజేపీ కార్యకర్తలు పని చేసుకుంటూ పోవాలన్నారు. అంతేకాకుండా.. ‘బీఆర్ఎస్ అవినీతి పాలనపై పోరాడేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్దం కావాలి. కేసీఆర్ మునుగోడు లో అడ్డదారిలో గెలిచారు. నిజమైన కురుక్షేత్ర యుద్ధం ముందుందని ,ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు.. ఎలక్షన్స్ ఎప్పుడూ వచ్చిన సిద్దం గా ఉండాలి. మళ్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తుంది. రాష్ట్రం తెచ్చుకున్నం. ఆత్మబలిదానాలు చేసుకున్నారని, కొంత మంది కేసీఆర్ కాళ్ల దగ్గర పడేశారు. రైతుబంధు తప్ప మిగతా అన్ని ఆపేశారు.24 గంటల ఉచిత కరెంటు రావడం లేదు, రుణమాఫీ చేయలేదు.

Also Read : DK Aruna : బడ్జెట్ బడుగు బలహీనవర్గాలకు ఊతం ఇచ్చి, దేశ ప్రగతికి దోహద పడేలా ఉంది

ధనిక రాష్ట్రం అప్పుల పాలు చేశారు. బడిలో సరైనా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారం, డబ్బుతో బీఆర్ఎస్ గెలుస్తుంది. మనం ధర్మం తో గెలవాలి. బీజేపీ ప్రభుత్వం రావాలంటే ఉమ్మడి జిల్లాలో పది సీట్లు గెలిచే బాధ్యత మీపై ఉంది. అధిష్టానం చెబితే ఆదిలాబాద్ జిల్లా పై ఫోకస్ పెడుతున్నారు. ఈటల రాజేందర్ ఉద్యమంలో ఉన్నప్పుడు కేటీఆర్ అమెరికా లో ఉన్నాడు. కేటీఆర్ నీ ఆస్తి ఎంత, బినామీ పేర్లతో కోట్లు ఉన్నాయి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అవినీతి కేసీఆర్ చేశారు. తండ్రి తర్వాత సీఎం కావాలని కేటీఆర్ చూస్తున్నారు. పోరాటం ఆపొద్దని, మునుగోడు ఎలక్షన్ లో గెలిచామని అనుకొని ముందుకు వెళ్లాలి.’ అని రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read : Layoff in paypal : నేడు పే పాల్ వంతు.. ఊడిపోయిన 2000ఉద్యోగాలు

Exit mobile version