Site icon NTV Telugu

Komatireddy Rajgopal Reddy : అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నా..

Komatiredy Rajgopal Reddy

Komatiredy Rajgopal Reddy

MLA Komatireddy Rajgopal Reddy Clarity About His BJP Joining Date.

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వీడి బీజేపీలో చేరుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే నేడు రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీలో అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 20న అమిత్ షాను కలిసాక.. అపుడు కలిసిప్పుడు బీజేపీలో చేరే విషయంపై చర్చించలేదన్నారు. రాజీనామా చేస్తే, మా నాయకులతో మాట్లాడి చేస్తా అని చెప్పానని, ఉపఎన్నికల కోసం అయినా.. కేసీఆర్ దిగి వచ్చి నిధులు ఇస్తారు అని భావించానన్నారు. పదవికి, పార్టీకి రాజీనామా చేసానని, స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా లేఖ రాసి పెట్టుకున్నానని, స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వగానే, రాజీనామాను ఆమోదించుకుంటానన్నారు.

మునుగోడు తీర్పుతో రాజకీయాల్లో మార్పు రావాలన్నారు రాజగోపాల్‌రెడ్డి. అమిత్ షా జాయినింగ్ డేట్ ఫిక్స్ చేయమన్నారని, అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, నేను రాజీనామా చేస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. అమిత్‌ షా నన్ను బీజేపీలోకి ఆహ్వానించారని, ఈ నెల 21న అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు.

Exit mobile version