Site icon NTV Telugu

Komatireddy : రేవంత్, ఠాక్రే తో ముగిసిన కోమటిరెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే

Komati Reddy

Komati Reddy

Komatireddy : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏడాది తర్వాత ఆయన గాంధీభవన్‌లో అడుగుపెట్టారు. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రేతో కూడా కోమటిరెడ్డి భేటీ అయ్యారు. వీరి భేటీ తర్వాత కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌ ఎదుట వెంకట్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో అందరికీ గౌరవం దక్కాలి. అందరి సమష్టి నిర్ణయాలు ఉండాలి. ఇవన్నీ జరిగితే నేను మరింత ఉత్సాహంతో పనిచేస్తాను అని చెప్పాను. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలని ప్రజల మనసులో ఉంది. హాత్‌ సే జోడో యాత్ర ఎలా చేయాలనే అంశంపై చర్చించామన్నారు.

Read Also: Komatireddy Venkat Reddy: నేనెప్పుడూ రానని చెప్పలేదే.. ఫోన్ చేస్తేనే వచ్చాను

కేసీఆర్ ఏ సమయంలోనైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ, విశ్వాసం వుందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేసేందుకు కృషి చేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. అంతర్గత విషయాలను పక్కనబెట్టి.. 60 నుంచి 70 శాతం ఎమ్మెల్యే అభ్యర్ధులను ముందుగానే డిసైడ్ చేయాలని ఆయన కోరారు. ఎన్నికలు 15 రోజులు వుండగా టికెట్లు ఇవ్వడం సరికాదని.. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి ఎప్పుడో తీసుకెళ్లానని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. పోటీ ఉన్న చోట నేతలను కూర్చోబెట్టి మాట్లాడాలని , ప్రభుత్వం వస్తే వాళ్లలో ఒకరికి ఎమ్మెల్సీ, నామినేటెడ్, ఛైర్మన్ పోస్టు ఇస్తామని హామీ ఇవ్వాలన్నారు.

Read Also: Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో విబేధాలు.. అలిగి వెళ్లిపోయిన వీహెచ్

రాష్ట్రంలోని సమస్యలపై కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహించాలని కోమటిరెడ్డి అన్నారు. నేతలకు అన్ని రకాలుగా అండగా వుండి ప్రజా ఉద్యమాలు చేయాలని కోమటిరెడ్డి కోరారు. 9 ఏళ్ల నుంచి డీఎస్సీ లేదని ఆయన మండిపడ్డారు. గాంధీ భవన్‌కి రావడం తగ్గించి, నియోజకవర్గంలో ఎక్కువ సమయం వుండాలని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఇన్‌ఛార్జ్ కూడా జిల్లాల వారీగా తిరగాలని చెప్పానని కోమటిరెడ్డి తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు 40-50 సీట్లు వస్తాయి. నాకు, రేవంత్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కాంగ్రెస్‌ బలమైన పార్టీ. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై పోరాడుతాము అని స్పష్టం చేశారు.

Exit mobile version