Kollu Ravindra: వారి దుర్మార్గాలకు క్రీడాకారులు కూడా బలైపోతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలకు క్రీడాకారులకు కూడా బలైపోతున్నారని దుయ్యబట్టారు. అందుకు నిదర్శనం హనుమ విహారినేనని అన్నారు. ప్రతిభ, సామర్థ్యాలున్న హనుమ విహారిని కాదని, వైసీపీ నాయకుడి కోసం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పని చేయడం క్రీడాలోకానికే అవమానం అని పేర్కొన్నారు. శరత్ చంద్రారెడ్డి నేతృత్వంలో ఏపీ క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రతిష్ట మసక బారిందని వ్యాఖ్యానించారు. దోపిడీకి ఆలవాలంగా మారిందని పేర్కొన్నారు.
Read Also: Viral Video : అరె ఏంట్రా ఇది.. మంచును కూడా వదలరా..వీడియో వైరల్..
Also Read
- Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుమలలో హార్దిక్ పాండ్యా.. శ్రీవారికి తలనీలాలు సమర్పించి కొత్త లుక్‌తో షాక్..!
- Tilak Varma: స్టార్ బాయ్‌కి ప్రమోషన్.. సౌత్ జోన్ కెప్టెన్‌గా ఛాన్స్.!
- CWG 2026 Medals: ఒక్క రోజులో 16 పతకాలు.. పాయింట్స్ పట్టికలో ఆరు స్థానాలు ఎగబాకిన భారత్.!
- Secunderabad: పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ప్రారంభం
ఏసీఏలో రూ.120 కోట్ల డిపాజిట్లకు బదులు కేవలం రూ.20 కోట్లే ఎందుకు ఉన్నాయి? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో క్రీడల్ని ప్రోత్సహించి, క్రీడాకారులకు చేయూత అందిస్తే.. జగన్ రెడ్డి హయాంలో క్రీడాకారులు బలి పశువులు అవ్వడం బాధాకరమని తెలిపారు. హనుమ విహారికి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి నోరు విప్పాలని కొల్లు రవీంద్ర కోరారు. జాతీయస్థాయి క్రికెటర్ కు అన్యాయం చేసిన సొంత పార్టీ నేతలపై క్రీడాశాఖ మంత్రి రోజా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: Bihar: బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లకు షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు..
ఇదిలా ఉంటే.. సోమవారం ఆంధ్ర రంజీ జట్టుకు భారత టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. భవిష్యత్‌లో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని వెల్లడించాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై ట్విట్టర్లో, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆవేదన వెళ్లగక్కాడు. క్రికెట్లో ఏపీ రాజకీయ నేత జోక్యం ఉందని మనస్తాపం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో విహారి పోస్టు చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో క్రీడాకారుల కన్నా.. రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువ ఉందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుమలలో హార్దిక్ పాండ్యా.. శ్రీవారికి తలనీలాలు సమర్పించి కొత్త లుక్‌తో షాక్..!
-
Varanasi : వారణాసి షూట్ ఆల్మోస్ట్ ఫినిష్.. సైలెంట్‌గా పని కనిచేస్తున్న రాజమౌళి
-
Gulveer Singh History: గుల్వీర్ సింగ్ నయా చరిత్ర.. తొలి భారత అథ్లెట్‌గా!
-
Huawei MatePad 11.5 2026: హువావే మేట్‌ప్యాడ్ 11.5 భారత్‌లో లాంచ్.. 10,100mAh బ్యాటరీ, 120Hz పేపర్‌మ్యాట్ డిస్ప్లే
ట్రెండింగ్
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!