Kolkata Rape Case : కోల్‌కతా హత్యాచారం కేసుపై మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్ల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Rape Case : కోల్‌కతా అత్యాచారం-హత్య కేసుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలోని ప్రతి ప్రాంతంలో, మహిళలకు భద్రత కలిపించాలని ప్రజలు వీధుల్లో నిరసనలు చేస్తున్నారు. మహిళల భద్రతపై ప్రజలు నిత్యం ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ కేసులో ఇప్పుడు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, మాజీ బ్యూరోక్రాట్‌లతో పాటు పలువురు ప్రముఖులు కోల్‌కతా బిడ్డకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం కోల్‌కతాలో జరిగిన ఘటనపై వారు మాట్లాడుతూ.. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. పశ్చిమ బెంగాల్ విధాన రూపకర్తలు వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలి.
దాదాపు మూడు వందల మంది న్యాయమూర్తులు, మాజీ బ్యూరోక్రాట్లు, సీనియర్ అధికారులు, మాజీ సైనికాధికారులు సంయుక్త ప్రకటనలో మాట్లాడుతూ.. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య పశ్చిమ బెంగాల్‌లో దిగజారుతున్న సామాజిక-సాంస్కృతిక దృశ్యాలను.. మహిళలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రమాదాలను గుర్తుచేస్తుంది. ఇలాంటి ఘటనలు ప్రభుత్వానికి జవాబుదారీతనం లోపిస్తున్నాయని అన్నారు.
Also Read
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
Read Also:Allu Arjun: పాత గాయం రేపేలా అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు??
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ చర్యపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. మొదట్లో ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందుకు బాధితురాలి తల్లిదండ్రులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వహించారు. ఇరవై నాలుగు గంటల్లోనే నేరస్థలానికి ఇరవై మీటర్ల దూరంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. దీనితో పాటు, వీలైనంత త్వరగా ఈ విషయంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, తద్వారా ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించాలంటూ వారు డిమాండ్ చేశారు.
దాదాపు మూడు వందల మంది మేధావులు సంతకాలు చేసి.. అన్ని కులాలు, మతాల మహిళల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. వైద్యుల భద్రత కోసం పెట్రోలింగ్, సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలి. అలాగే పురుష, మహిళా వైద్యులకు వేర్వేరుగా వాష్‌రూమ్‌లు ఉండాలి. ఎమర్జెన్సీ, SOS కోసం డాక్టర్ గదిలోనే ఏర్పాట్లు చేయాలి. సంస్థల పరిపాలనా అధిపతుల ప్రవర్తనపై కూడా సమగ్ర విచారణ జరగాలి. ఇది మాత్రమే కాదు, ఇది పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఒంటరి సంఘటన కాదని ప్రముఖ వ్యక్తులు చెప్పారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ అనేక విభాగాల్లో హింస నిరంతరంగా కనిపిస్తుంది. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై కూడా వారు పలు ప్రశ్నలు సంధించారు. దీనితో పాటు రాష్ట్ర శాంతిభద్రతల వ్యవస్థపై అనేక ప్రశ్నలు సంధించారు.
Read Also:PM Modi : పోలాండ్ లోని జామ్ సాహెబ్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన మోడీ
తాజావార్తలు
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!