NTV Telugu Site icon

Kolkata Mudrer Case: కోల్ కతా ఘటనలో అంతుచిక్కని తొమ్మిది ప్రశ్నలు

Hc0fxvecctc Hd

Hc0fxvecctc Hd

Kolkata Mudrer Case: కోల్ కతా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాధితురాలికి న్యాయం జరగాలని తీవ్రమైన నిరసనలు.. ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపడుతుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం చేపట్టింది. ఈ సందర్భంగా పలు సూటి ప్రశ్నలను సంధించింది. ఎఫ్ఐఆర్ దాఖలు చేయటంలో జరిగిన జాప్యంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలుగజేసుకుని వేసిన ప్రశ్నలకు ఆయన నోటి వెంట మాట రాని పరిస్థితి. ‘‘అదేంటి సిబల్.. హత్యాచార ఘటన తెల్లవారుజామున గుర్తించినట్లు తెలుస్తోంది. అలాంటిది ఈ ఉదంతంపై ఎఫ్ఐఆర్ ను వైద్యవిద్యార్థిని మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన మూడు గంటల తర్వాత రాత్రి 11.45 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చింది? అప్పటివరకు ఆసుపత్రి అధికారులు.. కోల్ కతా పోలీసులు ఏం చేస్తున్నారు? మృతదేహాన్ని చూపించేందుకు బాధితురాలి తల్లిదండ్రులను గంటల పాటు వేచి చూసేలా ఎందుకు చేశారు? దీన్ని మీరెలా సమర్థించుకుంటారు’’ అని సూటిగా అడగడంతో కపిల్ సిబల్ నోట మాట రాలేదు.

Read Also:Eluru: ఏలూరులో బాలుడి ప్రాణాలు తీసిన ఐఫోన్ మోజు..!

కోల్ కతాలోని ఆర్ జీకార్ వైద్య కళాశాలలో.. ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన అత్యంత పాశవికం.. భయంకరమైనదిగా సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ సమయంలో బెంగాల్ ప్రభుత్వం స్పందించిన తీరును తీవ్రంగా తప్పు పట్టింది. అంతేకాదు.. నేరం జరిగిన స్థలాన్ని సంరక్షించే విషయంలోనూ చోటు చేసుకున్న వైఫల్యాన్ని తప్పు పట్టింది. పోలీసు శాఖను ప్రశ్నించింది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరును తప్పు పడుతూ.. వైద్య సేవల రంగంలో పని చేస్తున్న మహిళలు.. యువ వైద్యులు.. సిబ్బంది భద్రత విషయంలో సంస్థాగత లోపాలు ఉన్నాయన్న ఆందోళనను వ్యక్తంచేసింది. ఈ నెల 22 లోపు కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

Read Also:Dasara: తగ్గని దసరా దూకుడు.. IIFAలోనూ నాని సినిమాదే హవా!

అలాగే అసలు ఆ ఘటనలో ప్రధానంగా తొమ్మిది ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు.
* సెమినార్ హాల్లో ఆరోజు అసలేం జరిగింది ?
* తొలుత ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం చేశారు ?
* నేరం జరిగిన గంటల్లోనే ఘటనా స్థలానికి 20అడుగుల దూరంలో పునరుద్ధరణ పనులు ఎందుకు చేపించారు ?
* ఘటన జరుగగానే ప్రిన్సిపల్ ఎందుకు రాజీనామా చేయలేదు ?
* కుమార్తె మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపేందుకు ఐదు గంటలు ఎందుకు ఆలస్యం అయింది ?
* సంజయ్ రాయ్ ని పోలీసులు వెంటనే పట్టుకున్నామంటున్నారు. ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తికి ఎలా వాలంటీరుగా ఉద్యోగం ఇచ్చారు ?
* దుర్ఘటన జరిగిన రెండు వారాల ముందే సంజయ్ రాయ్ మహిళా సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. ఫిర్యాదు చేసినా చర్యలేవి?
అదే నిజమైతే సంజయ్ రాయ్ కంటే నిందితుడిపై చర్యలు తీసుకోని వారిదే అసలు బాధ్యత ?
* సంజయ్ నేపథ్యం కూడా బాగోలేదు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి కేవలం బాక్సర్ అన్న కారణంతో వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారని తెలుస్తోంది. ఆయన పోలీసుల కంటే ఎక్కువ బిల్డప్ ఇచ్చి అజమాయిషీ చేస్తున్నా పట్టించుకోలేని స్థితిలో పోలీసులు ఉన్నారా ?
* పోలీసులు కూడా సందీప్ ఘోష్ కు వత్తాసు పలుకుతున్నారా ?