Kolkata: కోల్‌కతాలో బుల్డోజర్ల గర్జన.. అర్ధరాత్రి టీఎంసీ ఆఫీసు నేలమట్టం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం కోల్‌కతాలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. చారిత్రక హాగ్ మార్కెట్ (న్యూ మార్కెట్) ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి బుల్డోజర్లతో వచ్చిన ఓ గుంపు తృణమూల్ కాంగ్రెస్ (TMC) యూనియన్ కార్యాలయాన్ని కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అత్యంత రద్దీగా ఉండే ఈ వ్యాపార కేంద్రంలో బుల్డోజర్ల గర్జనతో భయాందోళనకు గురైన వ్యాపారులు తమ షాపులను మూసేసి పరుగులు తీశారు. టీఎంసీకి చెందిన న్యూ మార్కెట్ యూనియన్ ఆఫీసు ఈ ఘటనలో పూర్తిగా నేలమట్టమైంది. ఈ పరిణామంపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహువా మోయిత్రా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. బీజేపీ ఎన్నికల నినాదమైన ‘పరివర్తన్’ను ఎద్దేవా చేశారు. “కోల్‌కతాలోని చారిత్రక న్యూ మార్కెట్.. బెంగాలీలు ఈ పరివర్తనాన్ని ఆస్వాదిస్తున్నారు” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరో సీనియర్ నేత డెరెక్ ఓబ్రెయిన్ స్పందిస్తూ.. పోలీసుల పర్యవేక్షణలోనే ఈ కూల్చివేతలు జరిగాయని ఆరోపించారు. కేంద్ర బలగాలు (CAPF) అక్కడ చూస్తుండగానే, బీజేపీ విజయోత్సవాల్లో భాగంగా మాంసం దుకాణాలను కూల్చడానికి బుల్డోజర్లను తీసుకొచ్చారని, ఇదే బీజేపీ అసలు రూపమంటూ మండిపడ్డారు.
మరోవైపు, ఈ అంశంపై టీఎంసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇది బీజేపీ మద్దతుదారుల గూండాయిజమని, వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించింది. నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి అగ్రనేతల అండదండలతోనే ఇదంతా జరుగుతోందని, ఘర్షణలు జరుగుతున్నప్పుడు అడ్డుకోవద్దని కేంద్ర బలగాలకు ఆదేశాలు ఇచ్చారని టీఎంసీ సంచలన ఆరోపణలు చేసింది. బెంగాల్‌లో ఈ ‘బుల్డోజర్ రాజకీయాలను’ అడ్డుకుంటామని స్పష్టం చేసింది. అయితే, ఈ ఆరోపణలను స్థానిక నివాసితులు, కొందరు వ్యాపారులు తోసిపుచ్చారు. కూల్చివేసిన నిర్మాణం అక్రమంగా నిర్మించినదని వాదిస్తున్నారు. గతంలో ఓ దుకాణదారుడి నుంచి బలవంతంగా లాక్కున్న స్థలంలో ఈ యూనియన్ ఆఫీసును నిర్మించారని చెబుతున్నారు. అలాగే, కూల్చింది మాంసం దుకాణం కాదని, అది అనధికారికంగా నిర్మించిన పార్టీ కార్యాలయమని స్థానికులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..