Site icon NTV Telugu

DC vs KKR: ప్లే ఆఫ్ ఆశలు సజీవం.. ఢిల్లీపై కోల్‌కతా ఉత్కంఠ విజయం

Kkr

Kkr

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా ఢిల్లీ, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో, కోల్‌కతా ఢిల్లీని 14 పరుగుల తేడాతో ఓడించింది. ఢిల్లీపై కోల్‌కతా ఉత్కంఠ విజయం సాధించింది. కోల్‌కతా ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన KKR 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Also Read:Off The Record: పటాన్‌చెరు కాంగ్రెస్‌లో ఆరని మంటలు.. పరిష్కారం కోసం ఇద్దరు సభ్యుల పార్టీ కమిటీ!

205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి శుభారంభం లభించలేదు. మొదటి ఓవర్ రెండో బంతికే అభిషేక్ పోరెల్‌ను అనుకుల్ రాయ్ అవుట్ చేశాడు. దీని తర్వాత, కరుణ్ నాయర్ కూడా 5వ ఓవర్లో తన వికెట్ కోల్పోయాడు. కరుణ్ బ్యాట్ నుంచి 15 పరుగులు వచ్చాయి. కెఎల్ రాహుల్ పై ఆశలు పెట్టుకున్న ఢిల్లీకి షాక్ తగిలింది. 7వ ఓవర్లో కేఎల్ రాహుల్ రనౌట్ అయ్యాడు. రాహుల్ బ్యాట్ నుంచి కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి. తర్వాత కెప్టెన్ అక్షర్ పటేల్, ఫాఫ్ డు ప్లెసిస్ మధ్య మంచి భాగస్వామ్యం ఏర్పడింది. కానీ నరైన్ ముందుగా అక్షర్ ను పెవిలియన్ కు పంపాడు. అక్షర్ 43 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 62 పరుగులు చేసిన తర్వాత ఫాఫ్ కూడా ఔటయ్యాడు. ఈ వరుస షాక్‌ల నుంచి ఢిల్లీ కోలుకోలేకపోయింది. ఢిల్లీ జట్టు 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులకు ఆలౌట్ అయింది.

Also Read:Off The Record: ఒకే ఒక్క స్కూల్.. ఆ ఇద్దరు నేతల మధ్య అగ్గి పెట్టిందా?

ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ కు శుభారంభం లభించింది. గుర్బాజ్, సునీల్ నరైన్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. కానీ మూడో ఓవర్లో 48 పరుగుల వద్ద గుర్బాజ్ వికెట్ పడింది. కోల్‌కతా స్కోరు 85 వద్ద రెండో దెబ్బ తగిలింది. నరైన్ 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత, 8వ ఓవర్లో కెప్టెన్ రహానె వికెట్ పడిపోయింది. రహానే 26 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్ 10వ ఓవర్లో ఔటయ్యాడు. అయ్యర్ మరోసారి విఫలమై 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Also Read:Off The Record: అన్నీ వాళ్లకేనా..? మన సంగతేంది బాసూ!

10 ఓవర్లు ముగిసేసరికి KKR స్కోరు 117-4. రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ మధ్య మంచి భాగస్వామ్యం ఏర్పడింది. కానీ 17వ ఓవర్‌లో అంగ్‌క్రిష్ రఘువంశీ 44 పరుగులు చేసి అవుట్ కావడంతో 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరుసటి ఓవర్లోనే, రింకు సింగ్ కూడా 36 పరుగులు చేసి ఔటయ్యాడు. రస్సెల్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో కోల్ కతా ఢిల్లీకి 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Exit mobile version