ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం రోలుపడి, ఎరుకోపాడు, చింతలపాడు, గానుగపాడు, కోమ్మిరెడ్డి పల్లి, ముష్టికుంట్ల, అక్కపాలెం, కాకర్ల గ్రామాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక, కూటమి అభ్యర్థి కొలికపూడికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు హారతులతో, డాన్సులు వేస్తూ కొలికపూడి శ్రీనివాసరావు ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. కాగా, ఎన్నికల ప్రచారంతో మాస్ స్టెప్పులతో కార్యకర్తలలో కొలికపూడి జోష్ ని నింపారు.
Read Also: Devadula Pump House: దేవాదుల పంప్ హౌస్ చోరీ కేసు.. అదుపులో 5 మంది..
ఇక, ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు క్రికెట్ ఆడుతూ యువతను ఉత్తేజ పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. మీ సమస్యలను నేను పరిష్కరిస్తాను అంటూ ప్రజలకు మాట ఇస్తూ.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తనదైనా స్టైల్లో స్పీచ్ ఇస్తూ నాయకులు, కార్యకర్తలలో జోష్ ని కొలికపూడి శ్రీనివాసరావు నింపారు.