NTV Telugu Site icon

Irfan Pathan: కోహ్లీ నిజస్వరూపం సూపర్-8లో కనిపిస్తుంది..

Irfan Pathan

Irfan Pathan

నేడు ఇండియా-అప్ఘనిస్తాన్ మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో అందరి చూపు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపైనే ఉంటుంది. ఇప్పటివరకు బ్యాట్స్మెన్కు పిచ్లు అనుకూలించని అన్ని లీగ్ దశ మ్యాచ్లను భారత్ అమెరికాలో ఆడింది. ఈ క్రమంలో.. సూపర్-8 మ్యాచ్ లు న్యూయార్క్ పిచ్ లపై జరుగనున్నాయి. దీంతో.. కోహ్లీ పరుగులు సాధిస్తాడని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో.. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కోహ్లీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సూపర్-8లో విరాట్ కోహ్లీ నిజ రూపాన్ని చూస్తామని తెలిపారు.

Read Also: Kodali Nani: ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన కర్మ జగన్‌కు లేదు..

పెద్ద మ్యాచ్ లలో ఎలా నిలబడాలో అతనికి తెలుసని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. కోహ్లీ ప్రత్యేకమైన ఆటగాడు.. జట్టు కోసం పోరాడుతాడని తెలిపారు. ఇప్పటి నుంచి మంచి షాట్లు ఆడుతాడని, న్యూయార్క్ లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.. మీరు నిజమైన కోహ్లీని చూస్తారని పఠాన్ చెప్పారు. విరాట్ కోహ్లీ కీలక సమయాల్లో నిలకడగా రాణిస్తున్నాడని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు. గ్రూప్ మ్యాచ్ లలో ఎక్కువ పరుగులు చేయకపోయినప్పటికీ, ప్రత్యర్థి బౌలర్లను ఇబ్బంది పెట్టే లక్ష్యంతో బరిలోకి దిగాడన్నారు.

Read Also: Hajj Pilgrims: నిప్పుల కొలిమిలా “హజ్ యాత్ర”.. 68 మంది భారతీయులతో పాటు 1000కి పైగా మృతి..

ఈ టీ20 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ ఓపెనర్ గా వస్తున్నారు. ఇంతకుముందు జరిగిన ఐపీఎల్ 2024లో ఓపెనర్ గా మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో.. టీ20 వరల్డ్ కప్ లో ఓపెనర్ గా బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటి వరకూ ఓపెనర్ గా రాణించపోయినప్పటికీ.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఏ మాత్రం అసంతృప్తి చెందడం లేదు.