Site icon NTV Telugu

Virat Kohli: పూణే స్టేడియంలో కోహ్లీకి మంచి రికార్డు.. రేపు వీర విహారమే..!

Kohli

Kohli

వన్డే ప్రపంచకప్ లో భాగంగా రేపు(గురువారం) ఇండియా- బంగ్లాదేశ్ మధ్య జరుగనుంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ ఇరుజట్లు తలపడనున్నాయి. అయితే ఈ మైదానంలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పేరిట మంచి రికార్డులు ఉన్నాయి. అతని వన్డే గణాంకాలు చాలా ఆకట్టుకున్నాయి. ఈ మైదానంలో వన్డేల్లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. కోహ్లీ 7 ఇన్నింగ్స్‌ల్లో ఐదుసార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించాడు.

Read Also: NZ vs AFG: ఆఫ్ఘానిస్తాన్ పై న్యూజిలాండ్ విజయం.. వరుసగా నాలుగో గెలుపు

అయితే ఇప్పటికే కోహ్లీ ఉన్న ఫాంలో ఆపడం కష్టమనుకుంటే.. పుణే స్టేడియంలో మంచి రికార్డులు ఉండంతో టీమిండియాకు కలిసొచ్చే అంశం. రేపు బంగ్లా బౌలర్లకు కోహ్లీ చుక్కలు చూపించడం గ్యారంటీ. ప్రపంచకప్ లో తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో మంచి ఇన్నింగ్స్ ఆడి.. జట్టుకు మొదటి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ఆఫ్ఘాన్ తో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు.

Read Also: Dhimahi Trailer: చనిపోయిన వాళ్ళతో మాట్లాడచ్చా?..వణికిస్తోన్న ధీమహి ట్రైలర్

పుణెలో ఆడిన 7 ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక ఇన్నింగ్స్‌లో మాత్రమే సింగిల్ డిజిట్ సాధించాడు. 64 సగటుతో 448 పరుగులు చేయగా.. 91.99 స్ట్రైక్ రేట్ ఉంది. మొత్తం 7 ఇన్నింగ్స్ ల్లో కలిపి కోహ్లి బ్యాట్ నుంచి 37 ఫోర్లు, 8 సిక్సర్లు వచ్చాయి. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 284 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో 272 ఇన్నింగ్స్‌లలో 57.56 సగటుతో 13,239 పరుగులు చేశాడు. ఇందులో 47 సెంచరీలు, 68 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

పుణెలో కోహ్లి ఏడు వన్డే ఇన్నింగ్స్‌లు

61 (85 బంతుల్లో) పరుగులు
122 (105 బంతుల్లో) పరుగులు
29 (29 బంతుల్లో) పరుగులు
107 (119 బంతుల్లో) పరుగులు
56 (60 బంతుల్లో) పరుగులు
66 (79 బంతుల్లో) పరుగులు
7 (10 బంతుల్లో) పరుగులు.

Exit mobile version