NTV Telugu Site icon

M. Kodandaram: పోడు రైతులకు పట్టాలు లేవు.. విద్య, వైద్యం ఉచితంగా అందట్లేదు

Kodandaram

Kodandaram

సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ జనసమితి 3వ ప్లీనరీ సమావేశంలో టీజేఎస్ చైర్మన్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండ రామ్ మాట్లాడుతూ.. తమ ఆర్థిక రాజకీయ స్వలాభాల కోసమే తెలంగాణ రాష్ట్రంలో సీఎం విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండానే సొంత ఎజెండాను అమలుపరుస్తున్నదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ పదాన్ని వదిలి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మరచి బీఆర్ఎస్ తో దేశ రాజకీయాలలో వెళ్లడం సరికాదని ఆయన హితవు పలికారు. దేశంలోనే అత్యధిక అప్పు ఉన్న రైతుగా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Ashish Vidyarthi : తన రెండో పెళ్లికి అసలు కారణం అదేనట.. నిజం చెప్పిన ఆశిష్ విద్యార్థి

పోడు రైతులకు పట్టాలు లేవని, విద్య, వైద్యం ఉచితంగా అందట్లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ పరిరక్షణకు ప్రజాస్వామ్య తెలంగాణకు టీజేఎస్ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడం ఒక టీజేఎస్ తోనే సాధ్యమని ఆయన తెలిపారు. తెలంగాణ శక్తులు ఉద్యమకారులు ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుకు రుణమాఫీ లేక అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారని, ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ జన సమితి అస్తిత్వాన్ని కాపాడుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : RBI: మీ దగ్గర పాతనోట్లు ఉంటే వెంటనే బ్యాంకులో మార్చుకోండి.. షరతులు వర్తిస్తాయి