బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోట్ల రద్దుకి కేసీఆర్ మద్దతు పలికారని, కాంగ్రెస్ అభ్యంతరం చెప్పిందన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలకు కేసీఆర్ మద్దతు పలికారని ఆయన అరోపించారు. బండి సంజయ్.. మా వైపు వేలు చూపెట్టడం కాదని.. తలకింద తపస్సు చేసినా.. 10 సీట్లకు మించదని ఆయన జోస్యం చెప్పారు. వ్యవసాయ చట్టాలపై బయట మోడీ క్షమాపణ చెప్పారు కానీ సభలో కనీసం బిల్లులు వెనక్కి తీలుకుంటాం అని చెప్పలేదన్నారు.
రాముడు.. ఆంజనేయ స్వామి మీకే సొంతమా…? మతాన్ని అందరం గౌరవిస్తామని, మీ లాగా రాజకీయాలకు దేవుణ్ణి వాడుకోమని ఆయన అన్నారు. కర్ణాటక ఎన్నికలో మోడీ జై భజరంగబళి అన్నాడు.. ఇదా పద్ధతి.. మానవసేవనే మాధవ సేవ అన్నారని, బీజేపీ మానవ సేవ చేయదు.. వాజపేయి ఇందిరాగాంధీని కాళీ మాతతో పోల్చారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Suicide Attempt: మాజీ ఎమ్మెల్యే కుమారుడి ఆత్మహత్యాయత్నం.. ఆస్తి పంచడం లేదని..
