Jr.NTR: అభిమానులు తాము ఆరాధించే నటులనే వారు దేవుళ్లుగా భావిస్తారు. వారి అభిమానం ఒక్కోసారి హద్దుదాటుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా ఘటనల్లో ఫ్యాన్స్ చేసిన పనులకు నటీనటులు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పిడింది. తమ అభిమాన హీరో సినిమా విడుదలైందంటే చాలు ఆనందంతో థియేటర్లలో క్రాకర్స్ కాల్చడం మొదలుకుని రకరకాలుగా పనులు చేస్తూ నానా హడావుడి చేస్తూ ఉంటారు. అభిమానుల్లో తెలుగు స్టార్ హీరోల అభిమానులు వేరయా అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ కు స్టార్ డమ్ తీసుకువచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘సింహాద్రి’ రీ రిలీజ్ అయిన విషయం తెల్సిందే.
Read Also:PM Modi: ఆస్ట్రేలియా పర్యటనలో మోడీ.. ఆకాశంలో గ్రాండ్ వెల్కమ్
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నందమూరి అభిమానులు నానా హంగామా చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో కూడా ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని రాబర్సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన కొందరు అభిమానులు మేకల తలలు నరికి థియేటర్ వద్ద హంగామా సృష్టించారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి తొమ్మిది మంది అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. థియేటర్ వద్ద రెండు మేకలను కోసినందుకు వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు థియేటర్ వద్ద కేక్ కట్ చేసి రెండు మేకలను కోసి ఆ రక్తాన్ని ఫ్లెక్సీలపై చల్లారు. దాంతో పోలీసులు 9 మందిని అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.
Read Also:Balakrishna: ఊహించని కాంబినేషన్.. బాలయ్య, రజనీ, శివకుమార్.. బాక్సాఫీస్ బద్దలే