NTV Telugu Site icon

Kodali Nani: టీడీపీకి కొడాలి నాని సవాల్‌.. అది నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై..!

Kodali Nani

Kodali Nani

Kodali Nani: టీడీపీ నేతలకు సవాల్‌ విసిరారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. కృష్ణా జిల్లా గుడివాడలో ముస్లిం సంచారజాతుల బీసీ(ఈ) కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ముస్లిం సోదరులకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడ గురించి చంద్రబాబు, టీడీపీ పకోడీగాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజల త్రాగునీటి అవసరాలు, నివాస స్థలాల కోసం టీడీపీ హయంలో ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయకుండా, రాజకీయాలనుండి తప్పుకుంటానని ఛాలెంజ్‌ చేశారు.. సీఎంలుగా వైఎస్ఆర్, వైఎస్‌ జగన్.. గుడివాడ ప్రజల అవసరాల కోసం 625 ఎకరాల భూములు కొన్నారు. గుడివాడలో తన బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు… 14ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడు..? అని నిలదీశారు.

Read Also: Telangana Assembly Election: తెలంగాణలో తొలి ట్రాన్స్‌జెండర్‌కు టికెట్ ఇచ్చిన బీఎస్పీ

ప్రజలను ఆత్మబంధువులుగా చూసే వైఎస్‌ జగన్.. గుడివాడ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి 4 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు కొడాలి నాని.. రామాయణంలో పిడకల వేటలా పనికిమాలిన టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వస్తున్నారు. ధనికుల కార్లు బ్రేకులు వేయకుండా రోడ్లపై తిరగాలనే ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని మండిపడ్డారు. ప్రతి పేద వాడిని ఆత్మబంధువుగా చూసే జగన్ వాళ్ల అవసరాలు తీర్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. చంద్రబాబు మాదిరి ఒక్క విడత ఏదైనా పథకం ఆపితే రోడ్ల సమస్యను పరిష్కరించవచ్చని సీఎం జగన్ కు తాము చెప్పాం అన్నారు. ప్రాణం పోయినా ప్రజలకు ఇచ్చిన మాటను తప్పనని సీఎం జగన్ చెప్పారు… త్వరలో రాష్ట్రంలోని రోడ్ల సమస్య పరిష్కారం అవుతుంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇళ్లవద్దే 99 శాతం కుటుంబాల సమస్యలు పరిష్కారంమవుతున్నాయని తెలిపారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.