NTV Telugu Site icon

Kodali Nani Health Condition: తనకు అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని..

Kodali Nani

Kodali Nani

Kodali Nani Health Condition: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారని.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారంటూ.. సోషల్‌ మీడియాతో మాటు కొన్ని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.. దీంతో, తమ నేతకు ఏమైంది? అనే ఆందోళన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానుల్లో మొదలైంది.. అయితే, తనకు అనారోగ్యం అంటూ జరుగుతోన్న ప్రచారంపై తానే క్లారిటీ ఇచ్చారు కొడాలి.. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ప్రచారంపై స్పందించిన ఆయన.. చంద్రబాబును రాజకీయాల నుంచి, రాష్ట్రం నుంచి ఇంటికి పంపే వరకు నేను భూమి మీదే ఉంటానంటూ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చారు.

Read Also:Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

సునకానందం కోసం కొందరు తనకు అనారోగ్యం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కొడాలి నాని.. నేను అనారోగ్యానికి గురైనట్టు సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు.. టీడీపీ దిగజారుడు తనానికి ఇది నిదర్శనం, నాకు క్యాన్సర్‌ అంటూ ఐ-టీడీపీ ద్వారా టీడీపీ ఇలాంటి ప్రచారాలు చేయిస్తోందని దుయ్యబట్టారు. నాకు ఎలాంటి క్యాన్సర్‌ లేదని స్పష్టం చేశారు. ఇక, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుని మానసిక వైకల్య కేంద్రంలో చేర్చాలని సీఎం వైఎస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు కొడాలి నాని.. 2024 ఎన్నికలు అయిన తర్వాత వీళ్లకి మానసిక వైకల్య కేంద్రంలో చేరుస్తామన్న ఆయన.. దమ్ముంటే నాపై పోటీకి దిగాలని చంద్రబాబు, లోకేష్ కు సవాలు చేసినా స్పందించటం లేదన్నారు. చంద్రబాబుకి రాజకీయాల నుంచి చరమ గీతం పలికే వరకు నేను భూమి మీదే ఉంటా.. ఇలాంటి సోషల్ మీడియా ప్రచారాల వల్ల నాకేం కాదన్నారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.

Show comments