Site icon NTV Telugu

Kodali Nani: కొడాలి నాని కౌంటర్‌ ఎటాక్‌.. గుడివాడలో నన్ను.. రాష్ట్రంలో జగన్‌ను ఎవ్వరూ ఓడించలేరు..

Kodali

Kodali

Kodali Nani: కృష్ణా జిల్లా, గుడివాడలో అభిమానులు తన కాళ్లకు పాలాభిషేకం చేయడంపై రాద్ధాంతం చేసిన విపక్షాలు.. ప్రజలు నిరదీశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. నన్ను నిలదీశారంటూ వస్తున్న పకోడీ వార్తలను పట్టించుకోనన్న ఆయన.. గుడివాడలో నన్ను.. రాష్ట్రంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఎవ్వరూ ఓడించలేరన్నారు.. ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం.. మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను. అయినా తనపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల వద్దని చెప్పినా… నా కాళ్లు కడిగారని తెలిపారు.

Read Also: Family Star: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఫ్యామిలీ స్టార్‌’.. ర‌న్‌టైం ఎంతంటే?

ఇక, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్ వాళ్ల డప్పులు వాళ్లే కొట్టుకుంటు.. వాళ్ల దండలు వారే తెచ్చుకుంటున్నట్లు.. వారి తమ్ముళ్లను వాళ్లే పోగేసుకునేలా…కార్యక్రమాలు నేను చేయడం లేదు అంటూ సెటైర్లు వేశారు కొడాలి నాని. కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఎంతకైనా దిగజారతారని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో చెంబెడు నీళ్లు కాళ్లపై పోయడం పెద్ద విషయమా..? అని ప్రశ్నించారు. నన్ను అల్లరి చేయడానికి ఏమీ లేక… ఫాల్స్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజల ఇళ్ల సమస్యలు పరిష్కరించేలా.. 23 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి.. 12 వందల కోట్లతో ఇల్లు కట్టిస్తున్నాం అని వెల్లడించారు. రూ.320 కోట్లతో ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నాం.. మంచినీటి అవసరాల కోసం రూ.200 కోట్లు ఖర్చు చేశాం అన్నారు. 200 కోట్లతో రోడ్లు వేశాం.. ఎన్ని చేసినా ఎక్కడో ఒకచోట సమస్య అనేది ఉండటం సర్వసాధారణం. సమస్యలపై ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను అడుగుతారు.. వారికి సమాధానం చెప్పుకుంటామని పేర్కొన్నారు. మాకు మరో అవకాశం ఇస్తే పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తామని ప్రజలకు చెబుతాం. ప్రజలు నేను ముఖాముఖిగా మాట్లాడుకుంటుంటే.. నన్నేదో నిలదీశారంటూ పకోడీగాళ్లు హడావుడి చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.

Exit mobile version