NTV Telugu Site icon

Kodali Nani: పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉందా?.. లేక టీడీపీలో ఉందా?

Kodali Nani

Kodali Nani

ఏపీలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గబాటి పురంధరేశ్వరి వర్సెస్ వైసీపీ పార్టీ నేతల మధ్య పెరుగుతున్న డైలాగ్ వార్ నడుస్తుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని పురంధరేశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉందా? లేక టీడీపీలో ఉందా!? అని ప్రశ్నించారు. పురంధేశ్వరి లేఖలకు అదిరేవారు, బెదిరేవారెవరూ ఇక్కడ లేరు.. పురంధేశ్వరి ఒక లేఖ రాశారని టీడీపీ అనుకూల మీడియా హడావుడి చేస్తోంది.. చంద్రబాబు వదినను బీజేపీ రాష్ట్ర నాయకులే కొన్ని ప్రశ్నలు అడిగితే బాగుంటుంది అని కొడాలి నాని సూచించారు.

Read Also: INDIA bloc: కాంగ్రెస్‌కు ఇండియా కూటమి చాలా కీలకం, కానీ.. సీఎం నితీష్‌తో ఖర్గే..

అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ కక్ష సాధింపుగా జగన్, విజయసాయిరెడ్డి మీద కేసులు పెట్టాయని కొడాలి నాని అన్నారు. ఈ కేసుల్ని ఈరోజు కాకపోతే రేపు ఏ న్యాయస్థానం అయినా రాజకీయ కేసులే తప్ప, ఎలాంటి అధికార దుర్వినియోగం, అవినీతి జరగలేదు అని నిర్థారిస్తాయి.. ఇలా చార్జిషీట్ల నంబర్లు వేసి హడావుడి చేసినంత మాత్రాన ఇక్కడ బెదిరేవాళ్ళు ఎవరూ లేరు అని ఆయన తెలిపారు. అయితే పురంధేశ్వరి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉందా? లేక తెలుగుదేశం పార్టీలో ఉందా? అన్నది తేల్చాలి ఉంది అని కొడాలి నాని చెప్పుకొచ్చారు.

Read Also: SAIL Recruitment :సెయిల్ లో అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

ఎందుకంటే, పురంధేశ్వరి బీజేపీలో ఉన్నట్టు ఎక్కడా కనిపించడం లేదు అని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎన్నికల బరిలోకి దింపవద్దని చంద్రబాబు చేసిన నిర్ణయానికి కారణం ఏమిటో స్వయంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వివరించారు.. ఈ ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తోందని చంద్రబాబు స్పష్టం చేయటం వల్లే.. తాను ఇక టీడీపీలో ఉండనని కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించాడు.. అంటే దీని అర్థం ఏమిటి?.. కాంగ్రెస్ వెనుక, కాంగ్రెస్ తోనూ ఉన్నది చంద్రబాబేనని స్పష్టంగా కనిపిస్తోంది అని కొడాలి నాని వెల్లడించారు.

Read Also: Rachin Ravindra: న్యూజిలాండ్ యువ సంచలనం అరుదైన రికార్డ్.. ఆడిన తొలి వరల్డ్ కప్లోనే..!

తెలంగాణలో కాంగ్రెస్ తో పోరాడుతున్నాము కొడాలి నాని చెప్పారు. బీఆర్ఎస్ తో పోరాడుతున్నామని అంటున్న బీజేపీకి కాకుండా, పురంధేశ్వరి టీడీపీకి మద్దతు ఇస్తోంది.. టీడీపీ అంటే కాంగ్రెసే కదా?.. మరి, పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉన్నట్టా..? లేక టీడీపీలో ఉన్నట్టా? లేక బీజేపీలో ఉన్నట్టా? అన్నది బీజేపీ వారే అర్థం చేసుకోవాలి అని ఆయన తెలిపారు. ఆమె టీడీపీలో ఉండి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది.. కాంగ్రెస్ లో ఉండి కేంద్ర మంత్రి పదవి అనుభవించి, అధికారం పోగానే వారినీ వదిలేసి బయటకు వచ్చింది.. బాబు ఆదేశాల మేరకు, బాబు ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరింది.. మరి పురంధేశ్వరికి రాజకీయ విలువలు ఉన్నట్టా.. లేనట్టా?.. అని మాజీ మంత్రి కొడాలి నాని అడిగారు.