Kodali Nani: గుడివాడలో ఎవరు పోటీ చేయాలో జగనే చెబుతారు.. కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్‌గా సాగుతోన్న వేళ.. మరికొందరు సిట్టింగ్‌లకు, కీలక నేతలకు సైతం.. సీట్లు కేటాయించకపోవచ్చు అనే ప్రచారం సాగుతోంది.. ఈ తరుణంలో కృష్ణాజిల్లా, గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు.. గుడివాడలో తనకు సీటు లేదంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆయన.. గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం వైఎస్ జగనే చెబుతారు అని స్పష్టం చేశారు.. సీఎం జగన్ మార్చే అభ్యర్థులు, తీసేసే వారి పేర్లనే గత ఏడు లిస్టుల్లో ప్రకటించారు.. రాష్ట్రంలో ఇంకా సీట్లు ప్రకటించని 105 స్థానాలు ఉన్నాయన్నారు. వినేవాడు తెలుగు తమ్ముళ్లైతే.. చెప్పేవాడు చంద్రబాబులా.. ఏదో ఓ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీటు ఎవరికో అధిష్టానమో, మా పార్టీ నాయకులో చెబుతారు.. మధ్యలో ఉన్న పకోడీగాళ్లకు ఏం సంబంధం? అని నిలదీశారు.
Read Also: YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa: గుడ్‌న్యూస్.. రేపే వారి ఖాతాల్లో సొమ్ము జమ
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
తెల్లరేషన్ కార్డు ఉన్న వ్యక్తులకుకూడా సీఎం జగన్ సీటు ఇచ్చారు.. బ్రోకర్ పనులు, పైరవీలు చేస్తానో.. డబ్బుందనో.. ఎవరో చెప్పారని.. వైసీపీలో సీట్లు ఇవ్వరని స్పష్టం చేవారు కొడాలి నాని.. సీఎం జగన్ లా చంద్రబాబు మగాడైతే.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక, గన్నవరం నుండి వల్లభనేని వంశీనే పోటీ చేస్తాడని స్పష్టం చేశారు.. కుట్రలు, కుతంత్రాల్లో భాగంగానే నాకు, వంశీకి సీటు లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు.. ఫ్లెక్సీల విషయంపై స్పందిస్తూ.. ఎవరో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయానికి తీసేశాడు.. ఫ్లెక్సీలు ఎవడైనా కట్టవచ్చు.. కానీ, అవి అర్థవంతంగా ఉండాలిగా అని ప్రశ్నించారు. దమ్ముంటే నన్ను ఓడించడానికి చంద్రబాబును గుడివాడ అభ్యర్థిగా పెట్టాలి అని సవాల్ చేశరారు. జీవితాంతం మాజీగా ఉండే చంద్రబాబు.. సోషల్ మీడియా నుండి ఛాలెంజ్ లు చేస్తున్నాడు.. సీఎం జగన్ ప్రస్తుతమే, కాదు పెర్మనెంట్ ముఖ్యమంత్రిగా ఉంటాడు. చంద్రబాబు.. సీఎం జగన్ ను కాకుండా, తనలా మాజీలుగా ఉండే వాళ్లపై ట్విట్టర్ (X) లో ఛాలెంజ్ చేసుకోవాలంటూ సెటైర్లు వేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!