NTV Telugu Site icon

Weight Loss : దట్ ఈజ్ ఆర్య.. ఏకంగా 114కేజీలు తగ్గిచూపించాడు

New Project (3)

New Project (3)

Weight Loss : ప్రస్తుతం సమాజంలో చాలా మందిని వేధిస్తోన్న ఆరోగ్య సమస్య స్థూలకాయం. సగటు కంటే ఎక్కువ బరువు ఉన్నవారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో ఓ అబ్బాయి ఫోటో వైరల్ అయింది. అతడి పేరు ఆర్య పర్మన. తాను 10 సంవత్సరాల వయస్సులో దాదాపు 200 కిలోల బరువు పెరిగాడు. ప్రపంచంలోనే అత్యంత లావుగా ఉన్న అబ్బాయిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాను బరువును తగ్గించుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేసి ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. అతను బరువు తగ్గడానికి ఇండోనేషియాకు చెందిన ప్రముఖ బాడీబిల్డర్ సహాయం చేశాడు.

ఇండోనేషియాలో నివసిస్తున్న ఆర్యకు వీడియో గేమ్‌లు ఆడడం చాలా ఇష్టం. అతను ప్రాసెస్ చేసిన ఆహారం, ఇన్‌స్టంట్ నూడుల్స్ వంటి జంక్ ఫుడ్‌లు, శీతల పానీయాలు వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవాడు. అంటే అంత చిన్న వయస్సులో అతను దాదాపు 7000 కేలరీలు తీసుకునేవాడు. ఇది అతని శరీరానికి అవసరమైన దానికంటే ఆరు నుండి ఏడు రెట్లు ఎక్కువ. దీనివల్ల అతను బరువు పెరిగాడు. భారీ కాయం కారణంగా ఆర్య నడవలేడు లేదా కూర్చోలేడు. ఇంట్లో స్నానం చేయడం కుదరకపోవడంతో ఇంటి బయట పెద్ద తొట్టిలో స్నానం చేసేవాడు. తన సైజులో బట్టలు కూడా ప్రత్యేకంగా కుట్టించుకోవాల్సి వచ్చేది.

Read Also: Amit Shah: హౌరాలో రామనవమి రోజు హింస.. బెంగాల్ గవర్నర్‌ని నివేదిక కోరిన అమిత్ షా..

ఆర్య ఏప్రిల్ 2017లో బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాడు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న అతి పిన్న వయస్కుడిగా ఆర్య నిలిచాడు. జకార్తాలోని ఓమ్నీ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స తర్వాత బాడీబిల్డింగ్ ఛాంపియన్ అడె రాయ్‌ని కలిశాడు. ఆర్య గురించి తెలుసుకున్న ఆడే ఆర్యకు తన సహాయం చేస్తానని మాటిచ్చాడు. ఆపై ఆర్య కుటుంబంతో కూడా మాట్లాడాడు. అదే మార్గదర్శకత్వంలో, ఆర్య తన ఆహారపు అలవాట్లను మార్చుకున్నాడు. కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారాలు తినడం ప్రారంభించాడు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో హిందువుల ఆందోళన.. హిందూ బాలికలు, మహిళల కిడ్నాపులు, మతమార్పిడిపై నిరసన

ఆర్య జిమ్‌లో వ్యాయామం చేయడం ప్రారంభించాడు. అతడు ఎక్కువగా నడిచేవాడు. ఇది అదనపు కేలరీలను బర్న్ చేయడంలో అతనికి సహాయపడింది. ఆర్య మూడు సంవత్సరాలలో సగానికి పైగా బరువు తగ్గాడు. ఆర్య ఇప్పుడు పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాడు. ఇప్పుడు తన పనులు తానే చేసుకోగలడు. అతను ఇతర పిల్లలలాగే ఫుట్‌బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్ మొదలైనవాటిని కూడా ఆడగలడు.