NTV Telugu Site icon

Klin Kaara : రామ్ చరణ్ కూతురుతో మేనత్త ఫోటోలకు ఫోజులు.. కాకపోతే..

Klinkara Susmitha

Klinkara Susmitha

రామ్ చరణ్ – ఉపాసనల క్లిన్ కారా కుమార్తె ఇటీవల జూన్ 20న తన మొదటి పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ లిటిల్ మెగా ప్రిన్సెస్ పుట్టినప్పటి నుండి ఆమె ముఖాన్ని ఎవరికీ చూపించలేదు. కనీసం క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే అయినా పురస్కరించుకుని ఫోటోలు రిలీజ్ చేసి క్లిన్ కారా మొహం చూపిస్తారా అని మెగా ఫ్యాన్స్ అనుకున్నారు. కాకపోతే అది కూడా జరగలేదు. క్లిన్ కారా మొదటి పుట్టినరోజును మెగా ఫ్యామిలీతో కలిసి మెగా ఫ్యామిలీ నిరాడంబరంగా జరుపుకుంది. ఫోటోలు కూడా ఎక్కడా పోస్ట్ కూడా చేయలేదు. దీంతో మెగా అభిమానులు కాస్త నిరాశ చెందారని చెప్పవచ్చు.

TRAI: భారత్ లో 120 కోట్లకు చేరుకున్న టెలికాం సబ్‌స్క్రైబర్స్..నష్టాల్లో బీఎస్ఎన్ఎల్

అయితే రాంచరణ్ సోదరి క్లిన్ కారా మేనత్త సుస్మిత కొణిదెల తాజాగా పాప పుట్టినరోజు నాడు పాపతో పాటు దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. సుస్మిత కొణిదెల క్లిన్ కారా తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ” హ్యాపీ ఫస్ట్ బర్త్ డే మై సీటెస్ట్. అత్త నిన్ను చాలా లవ్ చేస్తుంది” అని పోస్ట్ లో తెలిపింది. అయితే ఇక్కడ విశేషమేమిటంటే, ఈ ఫోటోలలో కూడా క్లిన్ కారా ముఖాన్ని చూపించలేదు.

Tomato prices: టమాటా ధరలకు మళ్లీ రెక్కలు.. సెంచరీ కొట్టిన కిలో ధర

క్లీన్ కారా మొదటి పుట్టినరోజు నుండి చిత్రాలు ఇంకా విడుదల కానప్పటికీ, సుస్మిత కొణిదెల ఈ చిత్రాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలను మెగా అభిమానులు వాటిని వైరల్ చేసారు.

Show comments