క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31 నుంచి ఈ పొట్టి క్రికెట్ సంగ్రామం మొదలుకానుంది. లీగ్ దశలో 10 జట్ల మధ్య.. మొత్తం 70 మ్యాచ్‌లు జరుగుతాయి. కరోనా కారణంగా మూడేళ్ల పాటు హైదరాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో మళ్లీ.. అన్ని ఫ్రాంచైజీల సొంత మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఈసారి హైదరాబాద్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏప్రిల్ 2న ఆదివారం హైదరాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ ద్వారా లీగ్‌ను ప్రారంభించనుంది సన్‌రైజర్స్. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని మ్యాచ్‌ల వివరాలు చూద్దాం.
తేదీ ప్రత్యర్థి
ఏప్రిల్ 2 (ఆదివారం 3.30PM) రాజస్తాన్ రాయల్స్
ఏప్రిల్ 9 (ఆదివారం 7.30PM) పంజాబ్ కింగ్స్
ఏప్రిల్ 18 (మంగళవారం 7.30PM) ముంబై ఇండియన్స్
ఏప్రిల్ 24 (సోమవారం 7.30PM) ఢిల్లీ క్యాపిటల్స్
మే 4 (గురువారం 7.30PM) కోల్‌కతా నైట్‌రైడర్స్
మే 13 (శనివారం 3.30PM) లక్నో సూపర్ జెయింట్స్
మే 18 (గురువారం 7.30PM) బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్
లీగ్ దశలో హైదరాబాద్ జట్టు.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లతో హైదరాబాద్‌లో మ్యాచ్‌లు లేవు. ఈ నేపథ్యంలో లీగ్ దశ మ్యాచ్‌ల్లో ఉప్పల్ స్టేడియంలో ఎంఎస్ ధోనీని చూసే అవకాశం లేదు.
4️⃣4️⃣ days before we're #BackInUppal 😍#OrangeArmy, block your dates and get ready to back your #Risers in the #TataIPL2023 🔥 pic.twitter.com/HFABNikrCi
— SunRisers Hyderabad (@SunRisers) February 17, 2023