NTV Telugu Site icon

Trent Boult: కివీస్ స్టార్ బౌలర్ అరుదైన ఘనత.. తొలి బౌలర్గా రికార్డు..!

Boult

Boult

Trent Boult: వన్డే ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెండ్ బౌల్ట్ ఓ అరుదైన ఘనత సాధించాడు. తన జట్టు తరుఫున 50కు పైగా వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా బౌల్ట్ రికార్డ్ సృష్టించాడు. ఈరోజు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో కుశాల్ మెండీస్ వికెట్ తీసి ఈ ఫీట్ సాధించాడు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ లో 600 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

Read Also: Viral News: యువతకు రోల్ మోడల్గా నిలుస్తున్న 103 ఏళ్ల బామ్మ.. సూపర్ ఫిట్నెస్

ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌లో వేగంగా 50 వికెట్లు తీసిన మూడో బౌలర్ గా బౌల్ట్ గుర్తింపు పొందాడు. 28 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనత సాధించాడు. బౌల్ట్‌ కంటే ముందు లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్లు వసీం అక్రమ్‌ 33 ఇన్నింగ్స్ ల్లో, మిచిల్‌ స్టార్క్‌ 19 ఇన్నింగ్స్ ల్లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నారు.

Read Also: World cup 2023: ఆకాశమే హద్దుగా చెలరేగిన లంక బ్యాట్స్మెన్ .. వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

మరోవైపు ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన జాబితాలో బౌల్ట్‌ ఆరో స్ధానంలో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్ లో 50 ప్లస్ వికెట్లు పడగొట్టిన వారిలో ఆస్ట్రేలియా బౌలింగ్‌ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ అందరికంటే ముందున్నాడు. గ్లెన్‌ మెక్‌గ్రాత్‌(71 వికెట్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత శ్రీలంక లెజెండ్‌ ముత్తయ్య మురళీ ధరన్‌(68), మిచిల్ స్టార్క్‌(59), లసిత్‌ మలింగ(56), వసీం అక్రమ్‌(55), ట్రెంట్ బౌల్ట్ (51) ఉన్నారు.