Site icon NTV Telugu

Kishan Reddy : ప్రపంచాన్ని శాశించేవి జీ 20 సమావేశాలు…

Union Minister Kishan Reddy

Union Minister Kishan Reddy

లోయర్ ట్యాంక్ బండ్ మారియట్ హొటల్‌లో ఫోరమ్ ఫర్ నేషనలిస్ట్ థింకేర్స్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఇండియా జి 20 ప్రెసిడెన్సీ సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రిటైర్డ్ జడ్జి సుభాష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు,బీజేపీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. జీ20 గురించి తెలియని వారు ఏదో మాట్లాడుతున్నారన్నారు. నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత అన్ని రంగాల్లో మార్పు అస్థిస్త్వం కనబడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. నేషనల్ హైవే స్ రోడ్డులు చాలా అద్భుతంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. 5జీ ఇండియాలో ఉందని, తక్కువ రేటు కు మనకు దొరుకుతుందన్నారు.

Also Read : Bopparaju Venkateswarlu: ఇప్పుడు ఉద్యమం చేయకపోతే.. భవిష్యత్తు తరాలు క్షమించవు

ఫారెన్ పాలసీ అద్భుతంగా ఉందని, ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతుంటే 22వేల 500 మంది మన విద్యార్థులను ఇండియాకు రప్పించామన్నారు. ఫారెన్ పాలసీతోనే అది సాధ్యం అయ్యిందని, ప్రపంచానికి మన గొప్పతనాన్ని మోడీ తెలియజేశారన్నారు కిషన్‌రెడ్డి. జీ 20 సమావేశాలు చాలా దేశాల్లో జరిగాయని, 54 నగరాల్లో 250 సమావేశాలు జరిగాయన్నారు. ఈ సమావేశాల్లో మన బాష, కల్చర్, సంస్కృతి ఇతర దేశాలకు తెలియజేశామని, ప్రపంచాన్ని శాశించేవి జీ 20 సమావేశాలన్నారు. కళ సంపద భారతదేశంలో ఉంది అనేది ప్రపంచానికి మోదీ చాటి చెప్తున్నారని ఆయన వ్యా్‌ఖ్యానించారు.

Also Read : K Jayalakshmi: కె.విశ్వనాథ్‌ సతీమణి జయలక్ష్మి కన్నుమూత

Exit mobile version