Site icon NTV Telugu

Kishan Reddy: ప్రధాని టీ అమ్మిన రైల్వే స్టేషన్కు కిషన్ రెడ్డి.. వెళ్లింది అందుకోసమా..!

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: ప్రధాని మోడీ తన చిన్నతనంలో ఏం చేశాడంటే అందరికీ తెలిసిన విషయమే.. తన నాన్నకు సహాయంగా ఆయన కూడా టీ అమ్మారు. ఆ ప్రాంతం ఎక్కడనుకుంటున్నారా..? గుజరాత్ రాష్ట్రంలోని వాద్ నగర్. ఆ ప్రాంతాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో బుధవారం పర్యటించారు. ప్రాచీన పట్టణం, గొప్ప చరిత్రను వెలుగులోకి తెచ్చే “అనంత్ అనాది వాద్‌నగర్” డాక్యూసిరీస్‌ ప్రదర్శనను పురస్కరించుకుని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వాద్‌నగర్‌లోని రైల్వే స్టేషన్‌, తదితర ప్రాచీన ప్రాంతాలను సందర్శించారు.

Read Also: Harish Rao: పక్క రాష్ట్రాలు, దేశాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది

2022లో వాద్‌నగర్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో ప్రాచీన పట్టణ విశిష్టతను, గొప్ప చరిత్రను చాటిచెప్పే విధంగా కేంద్ర పర్యటక శాఖ.. పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వాద్‌నగర్‌లో గత 2700 సంవత్సరాల నుంచి ప్రజలు నివసిస్తున్నట్లు గుర్తింపులు ఉన్నాయి. ఈ చారిత్రాత్మక పట్టణమైన వాడ్‌నగర్‌ను భారతదేశంలోని చారిత్రక జీవన నగరాలైన మధుర, ఉజ్జయిని, పాట్నా, వారణాసితో పోల్చవచ్చు.

Read Also: Shanmukh Jaswanth : వీలు చైర్ లో దారుణమైన స్థితిలో కనిపించిన షణ్ముఖ్..?

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుజరాత్ పర్యటన సందర్భంగా.. బుధవారం వాద్ నగర్ రైల్వే స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు, పర్యాటక శాఖ అధికారులతో కలిసి టీ తాగారు. వారితో పలు విషయాలపై చర్చించారు. దీంతోపాటు రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి. అంతేకాకుండా అదే రైల్వేస్టేషన్ లో చిన్నతనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. తన నాన్నకు టీ అమ్మడంలో సహాయం చేసేవారు. దాదాపు 1880లలో వాద్ నగర్ రైల్వే స్టేషన్ ను నిర్మించారు. ఈ స్టేషన్ ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో స్థానిక ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.

Exit mobile version