Kishan Reddy: ఓటు వేయక పోతే సన్న బియ్యం, ఫ్రీ బస్ ఆగిపోతుంది అని సీఎం అన్నారు.. సన్నబియ్యంలో కేంద్ర ప్రభుత్వానిదే సింహభాగం.. ఏ విధంగా సీఎం ఆపుతారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సకల సమస్యలకు పరిష్కారం ఫ్రీ బస్సు అనే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన నిధులను, వచ్చిన సంస్థల వివరాలు కిషన్‌రెడ్డి వివరించారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో బీబీనగర్ ఎయిమ్స్ భవనాలు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతాయని వెల్లడించారు. 2 వందల బస్తీ దవాఖానలు కేంద్రం సహకారంతో నడుస్తున్నాయి… కేసీఆర్ పేరు మార్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 101 అభివృద్ధి కార్యక్రమాలు హైద్రాబాద్ పరిధిలో జరుగుతున్నాయన్నారు.
READ MORE: PM Modi: “సారూ.. మీ చర్మ సౌందర్య రహస్యం ఏంటి..?” ప్రధాని మోడీని అడిగిన లేడీ క్రికెటర్..
రేవంత్ రెడ్డి స్థాయికు దిగజారి నేను అడ్డుకుంటున్నాను అని మాట్లాడుతున్నారు. మెట్రో గురుంచి కూడా మాట్లాడుతున్నారు.. L&T మేము చేయలేము అంటుంది… ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలి… కొత్త DPR కేంద్రానికి ఇవ్వాల్సి ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. “తెలంగాణ బిడ్డగా నా నియోజక వర్గం అభివృద్ధి కోరుకుంటా.. బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి.. తెలంగాణ కోసం మా కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించాను..
వివిధ అంశాల పై కేసీఆర్‌కు 40 లెటర్లు రాశాను.. స్పందించలేదు.. అలాంటి వాళ్లు కూడా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు.. హైద్రాబాద్ లో డిఫెన్స్ మీద లక్ష 40 వేల కోట్లు ఖర్చు పెట్టింది కేంద్రం..” అని వెల్లడించారు.
READ MORE: PM Modi: జంగిల్ రాజ్ పాలనలో అభివృద్ధి శూన్యం.. మళ్లీ ఆ రోజులు కోరుకోవద్దన్న మోడీ
“పత్తి రైతులు ఆందోళన చెందొద్దు… మార్చి వరకు పత్తి కొంటాం.. కాంగ్రెస్ పార్టీ వి కూడా చాలా సార్లు డిపాజిట్ రాలేదు.. జూబ్లీహిల్స్ నాకు తెలుసు… అక్కడి ప్రజలు ఓటు వేసేది.. కౌంటింగ్ రోజు తెలుస్తుంది ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి.. రేవంత్ రెడ్డి మాటలను సిరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.. ఆయన మాట్లాడుతూ పోతుంటారు మనం వింటూ పోవాలి.. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ మీద సిబిఐ దర్యాప్తు జరపాలి అని మేము అడుగుతున్నాం..
హై కోర్టులో కేసు నడుస్తుంది.. నేను కూడా ఢిల్లితో మాట్లాడతా.. ఢిల్లి స్థాయిలో ఒప్పందం కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు జరిగింది. రేవంత్‌ను సీఎంగా కొనసాగించాలని రాహుల్‌కు ఇష్టం లేదు అని కేటీఆర్ అంటున్నారు..” అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
