NTV Telugu Site icon

Kishan Reddy: అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే కాంగ్రెస్ దందా మొదలు పెట్టింది..

Kishan Reddy

Kishan Reddy

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో విజయ సంకల్ప యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో జమ్మూకాశ్మీర్‌లో 43 వేల మంది భద్రతా బలగాలు బలయ్యారని తెలిపారు. పాకిస్తాన్‌ ఈ రోజు ప్రపంచ దేశాల ముందు ఏకాకిగా మిగిలిందని అన్నారు. నేడు దేశంలో సమర్ధవంతమైన నాయకత్వం ఉందని.. ఈ రోజు పాకిస్తాన్‌లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. మన సైనికుల్ని చంపిన ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే మట్టుబెట్టాలని మోడీ ఆదేశించారని.. ఉగ్రవాదుల్ని పాక్‌ గడ్డమీదే తుదిముట్టించిన ఘనత మోడీది అని కిషన్ రెడ్డి తెలిపారు.

Congress: హిమాచల్ చేజారితే.. ఈ రెండు రాష్ట్రాలకే కాంగ్రెస్‌కి దిక్కు..

రాష్ట్రంలో.. అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే కాంగ్రెస్ దందా మొదలు పెట్టిందని దుయ్యబట్టారు. బిల్డర్లను పిలిచి రాహుల్‌ గాంధీ ముఠా వందల కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు వసూలు చేసి ఎంపీ ఎన్నికలకు పంపిస్తున్నారని.. వంద రోజుల్లోనే ఢిల్లీ సూట్‌ కేసులు మోస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. హైదరాబాద్‌ చుట్టుపక్కల బీఆర్‌ఎస్‌ నేతలు వేల కోట్ల భూదోపిడీ చేశారని తెలిపారు. ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, కాంట్రాక్టుల మాఫియా చేశారని పేర్కొన్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ నేతలు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ మీద ప్రేమతోనే, రాహుల్‌ మీద ప్రేమతోనే కాంగ్రెస్‌ను గెలిపించలేదని.. కేవలం కేసీఆర్‌ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని బంగారు కుటుంబాన్ని చేసుకున్నారని కేసీఆర్ పై విమర్శలు చేశారు.

Pawan Kalyan: అభిమానులు నాకు ఓటు వెయ్యకపోతే నాకేం నష్టం లేదు..