Kishan Reddy: కాంగ్రెస్ శాసన సభ సంప్రదాయంను కాల రాసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత అలవాటు ను కొనసాగించిందన్నారు. మజ్లిస్ పార్టీతో చేసుకున్న ఒప్పందం మేరకు ఆ పార్టీకి చెందిన అక్బరుద్దీన్ ను ప్రోటెన్ స్పీకర్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా దగ్గిన కూలిపోయే ప్రమాదం ఉంది… అందుకే ఎంఐఎంను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. సీనియర్ లను పక్కన పెట్టీ ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ నీ ప్రోటెన్ స్పీకర్ చేయడాన్ని మేము ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ కు ఎంఐఎంకి లోపాయకార ఒప్పందం బయట పడిందని ఆరోపించారు. ఎంఐఎం, బీజేపీ ఒకటి అని దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ లని కాదని దొడ్డిదారిన అక్బరుద్దీన్ ను ప్రోటెన్ స్పీకర్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయాన్ని మేము బహిష్కరిస్తున్నమని తెలిపారు. ప్రొటెన్ స్పీకర్ ఆధ్వర్యంలో స్పీకర్ ఎన్నిక జరుగొద్దని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక అయిన తర్వాత మా ఎమ్మేల్యేలు ప్రమాణం చేస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Read also: Geriatrics : జెరియాట్రిక్స్ గురుంచి మీకు తెలుసా ?
శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకార కార్యక్రమం రాజ్‌భవన్‌లో జరిగింది. ఈ మేరకు అక్బరుద్దీన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు చేరుకున్నారు. అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అనంతరం అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇవాళ సాయంత్రం నోటిఫికేషన్ వెలువడనుంది. రేపు (ఆదివారం) స్పీకర్ ఎన్నిక జరగనుంది. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్‌గా రేవంత్‌రెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది.
Ram Charan: మెగా పవర్ స్టార్ కి ఇంటర్నేషనల్ అవార్డ్…