Site icon NTV Telugu

Kishan Reddy : మరోసారి తెలంగాణ రైతులకు కేంద్రం మద్దుతుగా నిలిచింది

Kishan Reddy

Kishan Reddy

తెలంగాణ నుంచి మరో 6.80 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్ సేకరణకు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మరోసారి తెలంగాణ రైతులకు మద్దతుగా నిలిచిన కేంద్ర ప్రభుత్వమని, 2021-22 రబీ సీజన్/2022-23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపింది. ఇప్పుడు 2022-23 (ఖరీఫ్ + రబీ) సీజన్లకు సంబంధించి మరో 6.80 లక్షల టన్నుల పార్ బాయిల్డ్ రైస్ సేకరణకు ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. తెలంగాణ రైతులకు మద్దతునందిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Also Read : CM Jagan: ఆర్తికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటీ.. పలు అంశాలపై చర్చ

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇటీవల కురిసిన అకాల వర్షాల మూలంగా నష్టపోయిన రైతులకు కొంత ఊరటనిస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ నిరంతర సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ యుద్ధప్రాతిపదికన రైతుల నుండి ధాన్యాన్ని సేకరించి, త్వరగా మిల్లింగ్ చేయించాలని, ఇచ్చిన గడువు లోపు FCI కు బియ్యాన్ని అందజేయటానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గత నెల్లో కేంద్రమంత్రి ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాసినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ నుంచి 15 లక్షల మెట్రికల్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు కిషన్ రెడ్డి.

Also Read : Mahindra Thar 5-door: మహీంద్రా థార్ 5-డోర్ వచ్చేది అప్పుడే..

Exit mobile version