తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పెద్దల నుంచి అత్యవసర ఫోన్ కాల్ రావటంతో బీజేపీ అధ్యక్షుడు దేశరాజధానికి బయలుదేరి వెళ్లారు. కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ అంశాలు ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మూడు విషయాలపై నిర్ణయం తీసుకుందని తెలిపారు. కృష్ణా వాటర్ పంపకాలపై ఉన్న వివాదాలు అందరికీ తెలుసు అని, ఉమ్మడి రాష్ట్రానికి గతంలో 800 టీఎంసీ ల వాటర్ గతంలో కేటాయించారన్నారు కిషన్ రెడ్డి.
Also Read : Bandaru Satyanarayana Murthy: టీడీపీ ఆఫీస్‌కు బండారు సత్యనారాయణ.. అందుకే రోజా గురించి మాట్లాడా..!
రెండో ట్రిబ్యునల్ ఏర్పాటు అయిందని, 2013 లో ట్రిబ్యునల్ రిపోర్ట్ ఇచ్చిందని, గెజిట్ కాలేదన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సమస్య మొదలయిందని, 2015లో తెలంగాణ సర్కార్ రిట్ పిటిషన్ వేసిందన్నారు కిషన్ రెడ్డి. 2021లో కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ ను టి సర్కార్ ఉపసంహరించుకుందని, కృష్ణా నీటి పంపకాల సమస్య పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలు కోరాయన్నారు. జూలై 2023లో కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ నివేదిక ఇచ్చారని, పాత ట్రిబ్యునల్ ను రద్దు చేయడం కన్నా . ఉన్నటు వంటి ట్రిబ్యునల్ కే అదనపు నిబంధనలు చేర్చాలని సూచించారన్నా కిషన్ రెడ్డి.
Also Read : Pakistan: పాక్ వదిలి వెళ్లాలి.. 17 లక్షల మందికి నవంబర్ 1 డెడ్‌లైన్