NTV Telugu Site icon

Kishan Reddy : జాబ్ క్యాలెండర్‌ను అధికార కాంగ్రెస్ గాలికి వదిలేసింది

Kishan

Kishan

Kishan Reddy : యాదాద్రి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో మీట్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలుచుకుందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు అడిగే ధైర్యం లేకనే తమ అభ్యర్థులను బరిలోకి దింపలేదన్నారు కిషన్‌ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ను అధికార కాంగ్రెస్ గాలికి వదిలేసిందని, ప్రజలను, నిరుద్యోగులను, ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

CM Chandrababu: వైఎస్‌ జగన్‌ భద్రతపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ఇది సబబేనా..?

రాష్ట్రంలో ఒక్కొక్క నిరుద్యోగికి 56 వేల రూపాయలు ప్రభుత్వం బకాయి పడిందని, రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ప్రజలకు ప్రయోజనం లేకుండా పోయిందని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో రౌడీయిజానికి, స్థానం లేదు. వాటిని కఠినంగా పని చేయాలన్నారు. రామలింగ మూర్తి హత్యపై సమగ్ర విచారణ జరగాలని, రాజకీయాలకు తావు లేకుండా… జరిగిన రామలింగమూర్తి హత్యపై సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Cars Price Hike: కారు కొనాలని చూస్తున్నారా.. ఈ కార్ల ధరలు పెరిగాయి, చెక్ చేసుకోండి