Kishan Reddy : ప్లాస్టిక్ రహితంగా కుంభమేళా

  • పవిత్ర నదుల్లో ఎన్నో ఏళ్లుగా కుంభమేళా జరుగుతోంది
  • జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా
  • 30 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం
  • కుంభమేళాలలో పెద్ద ఎత్తున హిందువులు పుణ్యస్నానాలు. : కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి
Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy : ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుకల్లో మహా కుంభమేళా ఒకటి. ఈసారి కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరంలో జరగనుంది. ఈ గొప్ప కార్యక్రమం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పవిత్ర నదుల్లో వందలాది సంవత్సరాలుగా కుంభ మేళా లు జరుగుతున్నాయని, ప్రయాగ రాజ్ లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా జరగనుందన్నారు.

Fire Accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్‌కు 10 ఫైరింజన్లు (వీడియో)

30 కోట్లకు పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, వేలాది సాధు సంతులు ఈ కుంభ మేళాలో పాల్గొననున్నారని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున హిందువులు ఈ కుంభ మేళాలో పుణ్య స్థానాలు చేయనున్నారని, పవిత్ర మైన రోజులు గా హిందువులు భావిస్తారన్నారు. 13,14,29 జనవరి,3,12,26 ఫిబ్రవరి తేదీలు మంచి రోజులు అని, ప్లాస్టిక్ రహితంగా కుంభమేళాలో ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలంగాణ నుండి వేలాది భక్తులు పాల్గొననున్నారని, కుంభ మేళా లో పాల్గొనాలని మాకు కూడా ఆహ్వానం అందిందన్నారు. నేను హాజరవుతను… పుణ్య స్నానం ఆచరిస్తానని ఆయన పేర్కొన్నారు.

Raj Kapoor: పాకిస్థాన్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడి శత జయంతి వేడుకలు…