NTV Telugu Site icon

Kishan Reddy : కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబేతరుల్ని ఎప్పుడు గౌరవించలేదు

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy : కార్మికుల కోసం , బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం పని చేసిన వ్యక్తి కర్పూరి ఠాకూర్ అని, బీహార్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి గా సేవలు అందించారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందీ భాష ప్రోత్సాహానికి విశేష కృషి చేశారని, గత ఏడాది అయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారత రత్న బిరుదు ఇచ్చిందన్నారు. ఇందిరాగాంధీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన వ్యక్తి అని, సోషలిస్టు పార్టీ నీ కూడా జనతా పార్టీ లో విలీనం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబేతరుల్ని ఎప్పుడు గౌరవించలేదని, భారత రత్న లు వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకున్నారని, ఆ కుటుంబం దృష్టిలో రాజకీయాలు అంటే కాంగ్రెస్ .. కాంగ్రెస్ అంటే నెహ్రూ కుటుంబమన్నారు కిషన్‌ రెడ్డి. పీవీ నరసింహా రావు కి భారత రత్న ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ కే దక్కుతుందని, ఎన్టీ రామారావు తెలుగు దేశం పార్టీ పెట్టీ ఏ విధంగా ఇక్కడ రాజకీయ మార్పు తీసుకొచ్చారో… అదే విధంగా కర్పూరి ఠాకూర్ బీహార్ లో తీసుకొచ్చారన్నారు కిషన్‌ రెడ్డి.

Donald Trump: ట్రంప్ ప్రకటనతో భారతీయ విద్యార్థుల్లో వణుకు.. వారి బాధలు వారి మాటల్లోనే…

అంతేకాకుండా..’నెహ్రూ తరవాత దేశం లో అత్యధిక కాలం ప్రధాని గా ఉన్నది నరేంద్ర మోడీ.. మాకు మాత్రమే హక్కు ఉందని ఆ నెహ్రూ కుటుంబం భావన…. ఏనాడూ బడుగు బలహీన వర్గాల గురుంచి పట్టించుకోలేదు కాంగ్రెస్.. రాజ్యాంగం పట్ల అవగాహన లేని వ్యక్తి…. దేశ రాజకీయాల పై అవగాహన లేని వ్యక్తి రాహుల్ గాంధీ.. అంబేద్కర్ ను మరణించిన తరవాత కూడా వదిలిపెట్టని.. అడుగడుగున ఆయన్ను అవమానించింది… సూర్య చంద్రులు ఉన్నంత కాలం, ప్రజా స్వామ్యం ఉన్నంత కాలం ఈ దేశం లో రాజ్యాంగం రద్దు కాదు.. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్… కాంగ్రెస్ పాఠాలు, రాహుల్ గాంధీ సర్టిఫికెట్ బీజేపీ కి అవసరం లేదు.. మీకు అవసరం ప్రజల సర్టిఫికెట్ అవసరం.. దేశ ప్రజలు మోడీ కి సర్టిఫికెట్ ఇచ్చారు..’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Uttar Pradesh : ఇన్స్పెక్టర్ అని చెప్పుకుని ఐదు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికొడుకు.. ఎలా దొరికిపోయాడంటే ?