Site icon NTV Telugu

Kishan Reddy: తెలంగాణ సమాజాన్ని అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నారు..

Kishan Reddy

Kishan Reddy

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పర్యటించారు. గజ్వేల్ అల్లర్లలో జైలుకు వెళ్లిన వారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దుర్మార్గానికి పాల్పడిన వారిని శింక్షించకుండా హిందువులను జైలుకు పంపించి మరో వర్గానికి కొమ్ము కాస్తున్నారు అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం హిందూ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.

Read Also: PM Modi On Red Diary: రెడ్‌ డైరీనే రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ను ముంచుతుంది: ప్రధాని మోడీ

బీజేపీ పార్టీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి, పోలీసు బలగాలతో భయబ్రాంతులకు గురి చేయడం తప్పు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ భూ కబ్జాలు, అక్రమ లిక్కర్ వ్యాపారాలు ప్రోత్సహించి, మహిళలను అవహేళన చేసిన ఎంతో మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణా సమాజాన్ని అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్న నాయకులను తెలంగాణా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అని కిషన్ రెడ్డి అన్నారు.

Read Also: Vikarabad: వికారాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్.. కోట్ పల్లి ప్రాజెక్ట్ వద్ద పరిస్థితులపై ఐజీ షనవాజ్ ఖాసీం ఆరా

నిజాం వారసులుగా తెలంగాణా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని టీబీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రజలు మీకు బుద్ది చెప్పడం ఖాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ గడ్డ మీద నుంచి సవాల్ చేస్తున్న మీ పార్టీలో ఉన్న అవినీతి నాయకులపై కేసులు పెట్టి అమాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Exit mobile version