Kishan Reddy: అప్పట్లో హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు.. మోడీ వచ్చాక ఉగ్రవాదుల జాడేలేదు..?
- 11 ఏళ్లు పరిపాలన చేయడానికి ప్రజలు ఆమోదం తెలిపిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం
- యూపీఏ ప్రభుత్వంలో ఏ వార్త చూసినా కుంభకోణాలు, అవినీతి పై వార్తలు వచ్చేవి
- అందుకే 2014 లో దేశ ప్రజలు అవినీతి ప్రభుత్వం కాదని, మోడీని ప్రధానిగా చేశారు
- ఏ ఒక్క రోజు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవినీతి జరిగినట్లు వార్తలు రాలేదు
- మోడీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడాదిగా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటెల రాజేందర్ చేసిన అభివృద్ధిని వివరించడానికి ఈ సభ ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. 11 ఏళ్లుగా మోడీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 11 ఏళ్లు పరిపాలన చేయడానికి ప్రజలు ఆమోదం తెలిపిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని కొనియాడారు. మరో 11 ఏళ్లు మోడీ పరిపాలన ప్రజలు కోరుకుంటున్నారని.. యూపీఏ ప్రభుత్వంలో ఏ వార్త చూసినా కుంభకోణాలు, అవినీతి పై వార్తలు వచ్చేవన్నారు. అందుకే 2014 లో దేశ ప్రజలు అవినీతి ప్రభుత్వం కాదని, మోడీని ప్రధాని గా చేశారని తెలిపారు. ఏ ఒక్క రోజు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవినీతి జరిగినట్లు వార్తలు రాలేదని చెప్పారు.. అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం ఉండేదని.. అప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉండేదని విమర్శించారు.. ఇప్పుడు అద్భుతమైన పరిపాలన ప్రజలు చూస్తున్నారన్నారు.
READ MORE: Road Accident: చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం.. ఒక్కసారి వ్యాపించిన మంటలు, ఇద్దరు మృతి!
Also Read
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
- Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్‌గా..
- Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో నెలల తరబడి తాజాగా..!
అభివృద్ధి లో దేశం ఎలా ముందుకు వెళ్ళాలో ప్రపంచానికి తెలిసేలా మోడీ ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.. అప్పుడు పాకిస్థాన్ ఆడిందే ఆటగా ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా దేశాన్ని అంతలాకుతలం చేసిందని.. అప్పుడు లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్‌సుక్‌నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగాయని గుర్తు చేశారు. ఇప్పుడు ఎక్కడా కూడా ఉగ్రవాద చర్యలకు తావు లేకుండా మోడీ ప్రభుత్వం చేసిందని తెలిపారు. అప్పుడు ఉగ్రవాద దాడి జరిగితే పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉండేదని.. కానీ, మోడీ ప్రభుత్వంలో ఉగ్రవాద దాడికి సర్జికల్ స్ట్రైక్ జరిగిందని చెప్పారు.. మొన్న కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రధాని మోడీ మన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారని కొనియాడారు. అమెరికాను తలతన్నే విధంగా మన దేశంలో రోడ్లు నిర్మించారని.. జాతీయ రహదారులను అనుసంధానం చేసిన ఘనత మోడీ ప్రభుత్వానికి సొంతమన్నారు.
READ MORE: Road Accident: చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం.. ఒక్కసారి వ్యాపించిన మంటలు, ఇద్దరు మృతి!
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క రైల్వే స్టేషన్ డెవలప్ కాలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.” కానీ మోడీ మాన రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేశారు.. విద్యుత్ లేకుండా ఏ గ్రామం కూడా ఉండొద్దని మోడీ తలచుకుని.. మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా అందించారు. కొంత మంది రాజకీయ పార్టీలు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు.. అప్పుడు ప్రపంచ స్థాయిలో అధినేతల మీటింగ్ జరిగితే మన ప్రధాని ఎక్కడున్నాడని వెతుక్కునే పరిస్థితి ఉండేది.. కానీ ఇప్పుడు మోడీ ప్రధాని అయ్యాక ముందు వరసలో మన ప్రధాని కనిపిస్తున్నారు.. గతంలో ఏదైనా దాడి జరిగితే.. క్యాండిల్ లైట్లతో ర్యాలీ తీసేవాళ్ళం.. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో తయారైన బ్రహ్మోస్ తో ఎదురు దాడి చేస్తామని పాకిస్థాన్‌కి తెలియజేశాం.. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబానికి బలి అయ్యింది.. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల పాలు చేసింది కేసీఆర్ కుటుంబం.. ఒక నియంత పాలనతో రాష్ట్రాన్ని వెనుకకు నెట్టారు.. ప్రజలు విసుగు చెంది మార్పు కోరుకున్నారు.. కేసీఆర్ ను గద్దె దించాలని నిర్ణయించుకున్నారు.. కానీ., రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన చేతకాని హామీలతో మరోసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు.. రైతులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు, మహిళకు అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారం చేపట్టింది కాంగ్రెస్.. ఇపుడు అధికారం చేపట్టాక ఏమీ చేయలేక పోతున్నా అంటున్నారు రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరాలంటే అది బీజేపీ తోనే సాధ్యం.. రాష్ట్ర అప్పులను తీర్చి.. ప్రజలకి అభివృద్ధి అందించాలి అన్నా బీజేపీ తోనే సాధ్యం.. తెలంగాణ ఆకాంశ తీరాలాంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారాన్ని అందించాలని కోరుతున్నాను..” అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తున్న ఈటెల రాజేందర్‌ను అభినందిస్తున్నట్టు తెలిపారు.
READ MORE: TPCC Mahesh Goud : స్థానిక సంస్థల ఎన్నికలపై బాంబు పేల్చిన టీపీసీసీ చీఫ్
తాజావార్తలు
-
Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
-
Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
-
Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్‌గా..
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో నెలల తరబడి తాజాగా..!
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!